National

TG : తెలంగాణలో స్థానికత వివాదం.. మరోసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రచన: Kumar••5 నిమిషాల పఠనం

తెలంగాణలో స్థానికత అంశంపై నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక తీర్పు వెలువరించింది. స్థానిక రిజర్వేషన్లు పొందాలంటే నాలుగేళ్ల నిబంధన తప్పనిసరి అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

తెలంగాణలో స్థానికత అంశంపై నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక తీర్పు వెలువరించింది. స్థానిక రిజర్వేషన్లు పొందాలంటే నాలుగేళ్ల నిబంధన తప్పనిసరి అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, స్థానికత అంశంపై బెల్లం అంకిత దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం సోమవారం విచారించి డిస్మిస్ చేసింది.

నాలుగేళ్ల పాటు ఒకేచోట విద్యాభ్యాస నిబంధన ఏకపక్షంగా ఉందంటూ పిటిషనర్ తరఫున చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది.స్థానికత నిర్ధారణలో రాజ్యాంగబద్ధంగా జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనలే అంతిమమని కోర్టు స్పష్టంచేసింది. ఇదే అంశంపై గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తుత ధర్మాసనం మరోసారి నొక్కిచెప్పింది.తెలంగాణలో నాలుగేళ్ల పాటు విద్యాభ్యాసం పూర్తి చేసిన వారికే స్థానికత వర్తిస్తుందని, నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికే రిజర్వేషన్ల ప్రయోజనాలు దక్కుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

కాగా, తెలంగాణ స్థానికత వివాదం ప్రధానంగా రాష్ట్రంలోని మెడికల్ (MBBS), డెంటల్ (BDS) సీట్ల భర్తీకి సంబంధించిన నిబంధనలపై తలెత్తింది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 33 ప్రకారం.. ఒక విద్యార్థి తెలంగాణ రాష్ట్ర కోటా (85% సీట్లు) కింద స్థానికత హోదా పొందాలంటే, సదరు విద్యార్థి ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతికి ముందు వరుసగా 4 ఏండ్ల పాటు తెలంగాణలోనే విద్యాభ్యాసం చేసి ఉండాలి.

దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై సుప్రీంకోర్టు కీలకమైన తుది తీర్పును వెలువరించింది. అయితే, తెలంగాణకు చెందిన శాశ్వత నివాసితులైనప్పటికీ, కొంతమంది విద్యార్థులు 11, 12 తరగతులు లేదా లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ -కోటా(లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ కోసం) లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు.

ప్రభుత్వం పెట్టిన 4 ఏళ్ల నిరంతర విద్యాభ్యాస నిబంధన వల్ల, సొంతంగా తెలంగాణకు చెందినవారైనప్పటికీ బయట చదవడం వల్ల వారు 'నాన్-లోకల్' (స్థానికేతరులు)గా మారిపోతున్నారు. దీనివల్ల వారు 85% లోకల్ రిజర్వేషన్ కోటాను కోల్పోవాల్సి వస్తోంది. గతంలో తెలంగాణ హైకోర్టు ఈ నిబంధనను తప్పుబడుతూ శాశ్వత నివాసితులకు 4 ఏళ్ల నిబంధనతో సంబంధం లేకుండా లోకల్ కోటా వర్తింపజేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా..ప్రభుత్వానికి అనకూలంగా తీర్పువచ్చింది.

#local quota#telangana#medicine seats#supream court#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి