ఏపీ

బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన వాయుగుండం.. ఐఎండీ వర్ష హెచ్చరికలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే వచ్చిన వరదల నుంచి కోలుకుంటున్న తీర ప్రాంత ప్రజలు తాజా వర్ష సూచనలతో మళ్లీ కలవరపడుతున్నారు.

మయన్మార్, అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన ఈ వాయుగుండం, ప్రస్తుతం అండమాన్‌లోని మాయాబందర్‌కు తూర్పు-ఈశాన్య దిశలో సుమారు 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తూ బంగ్లాదేశ్ వైపు కదులుతోంది. రానున్న 12 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని, సుమారు 72 గంటల వ్యవధిలో బంగ్లాదేశ్ తీరాన్ని దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇటీవలే ఉత్తరాంధ్ర తీరంలో కళింగపట్నం సమీపంలో ఒక తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి, పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ నష్టం నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడటంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

#BayOfBengalDepression#APRains#WeatherUpdateTelugu#AndhraPradeshNews#IMDAlert#APWeather#CoastalAndhra
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి