క్రైమ్

Crime : హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు.. ఒకరు అరెస్టు!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు అయ్యింది. గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ కరెన్సీని నగరంలో చెలామణికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ కరెన్సీ ఎక్కడ నుంచి వస్తుందని, ఎవరు సరఫరా చేస్తున్నారని పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

హైదరాబాద్ మహానగరంలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు అయ్యింది. గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ కరెన్సీని నగరంలో చెలామణికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ కరెన్సీ ఎక్కడ నుంచి వస్తుందని, ఎవరు సరఫరా చేస్తున్నారని పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. స్థానికంగా ఉండే చిరువ్యాపారులను నిందితుడు పలుమార్లు బురిడీ కొట్టించాడని తెలుస్తోంది.

వివరాల్లోకివెళితే.. నగరంలోని బేగంబజార్‌లో నకిలీ రూ. 500 నోట్లను చెలామణి చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన విక్రమ్ (21) అనే యువకుడిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8 వేల విలువ గల 16 నకిలీ రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బేగంబజార్ పరిసరాల్లోని చిన్న చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నట్టు విచారణలో తేలింది. అక్కడ చిన్న వస్తువులను కొనుగోలు చేస్తూ ఈ నకిలీ రూ.500 నోట్లను ఇచ్చేవాడు.

ప్రతి నకిలీ నోటుకు బదులుగా రూ.400 అసలు కరెన్సీని చిల్లర రూపంలో తిరిగి తీసుకుంటూ లాభం పొందేవాడని సమాచారం.రాజస్థాన్‌లోని పాలి జిల్లాకు చెందిన విక్రమ్.. బేగంబజార్‌లోని 'బాలాజీ డెకార్స్' అనే దుకాణంలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు తెలిసింది. సెప్టెంబర్ 25న బేగంబజార్ ఛత్రి వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన విక్రమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని గట్టిగా విచారించగా నకిలీ నోట్లను అశోక్ అనే వ్యక్తి నుంచి సేకరించినట్లు ఒప్పుకున్నాడు.

నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 179 (నకిలీ నోట్ల చలామణి), 180 (నకిలీ నోట్లను కలిగి ఉండటం), 318(4) (చీటింగ్) కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అశోక్, అలాగే నకిలీ నోట్ల ముఠా నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతర వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో బేగంబజార్ వ్యాపారులు సైతం అప్రమత్తం అయ్యారు. తమ వద్దకు వచ్చిన కరెన్సీని క్షుణ్ణంగా తనిఖీ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

#fake currency#begumbazar#hyderabad#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి