సినిమా

Balakrishna: మోక్షజ్ఞ–వశిష్ఠ సినిమా స్క్రిప్ట్ విన్న బాలయ్య..ఏదో నచ్చలేదా?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Balakrishna: నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో మోక్షజ్ఞ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఒకటి. యువ కథానాయకుడిగా మోక్షజ్ఞ ఎలాంటి కథతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడనే దానిపై ఇప్పటికే భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాను యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించనున్నారనే వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చగా మారింది.

మోక్షజ్ఞ చేయబోయో డెబ్యూ సినిమా కథ, స్క్రీన్‌ప్లేకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ను దర్శకుడు వశిష్ఠ ఇటీవలే బాలకృష్ణకు వినిపించినట్లుగా సమాచారం. తన కుమారుడి తొలి సినిమా కావడంతో బాలయ్య ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. కథలోని ప్రతి అంశాన్ని పరిశీలించిన ఆయన, దర్శకుడు వశిష్ఠకి కొన్ని కీలకమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

బౌండెడ్ స్క్రిప్ట్ విన్న బాలయ్య ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో కొన్ని మార్పులు, చేర్పులు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే ద్వితీయార్థం మరింత బలంగా ఉండాలని, హీరో క్యారెక్టర్‌కు అక్కడే అసలు ఎలివేషన్ రావాలని ఆయన సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా, మోక్షజ్ఞ పాత్రను ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడంతో పాటు, సెకండాఫ్‌లో వచ్చే కీలక సన్నివేశాలు మరింత బలంగా ఉండేలా మార్పులు చేయాలని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది.

బాలయ్య సూచనల మేరకు.. సెకండాఫ్‌లో కొన్ని కీలక మార్పులు చేసి స్క్రిప్ట్‌ను మరింత పక్కాగా సిద్ధం చేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ మార్పులు ఏ స్థాయిలో ఉంటాయి? కథలో ఎలాంటి సన్నివేశాలను మార్చబోతున్నారు? మోక్షజ్ఞ పాత్రకు ఎలాంటి ఎలివేషన్ ఇవ్వబోతున్నారు? అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నాయి.

మొత్తానికి మోక్షజ్ఞ తొలి సినిమా విషయంలో బాలకృష్ణ చాలా సీరియస్‌గా ఉన్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తండ్రి సూచనలు, వశిష్ఠ విజన్, మోక్షజ్ఞ స్క్రీన్ ప్రెజెన్స్.. ఈ మూడు కలిస్తే నందమూరి వారసుడి ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. అన్నట్టు, బాలయ్య కూడా ఈ సినిమాలో కనిపించే అవకాశాలున్నట్టుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హీరోయిన్‌గా డాన్సింగ్ క్వీన్ శ్రీలీలను పరిశీలిస్తున్నారట.

#Mallidi Vassishta#Mokshagna#Balakrishna#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి