తెలంగాణ

Breaking : ఆరుగురి హత్య కేసులో నిందితుడి ఎస్కేప్.. షాబాద్‌లో హైటెన్షన్!

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో ఆరుగురి హత్య కేసు సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్య కేసులో స్థానికంగా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.

రాష్ట్రంలో ఆరుగురి హత్య కేసు సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్య కేసులో స్థానికంగా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు రాస్తారోకో చేపట్టారు. షాబాద్–షాద్‌నగర్ ప్రధాన రహదారిపై 3 గంటలకు పైగా ఆందోళన కొనసాగుతోంది. దీంతో షాబాద్ నుంచి సర్దార్‌నగర్, షాద్‌నగర్ ఎల్లికట్ట వరకు, మరోవైపు నాగర్‌గూడ వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించడంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

నిందితుడి గురించి సంచలన విషయాలు వెలుగులోకి..

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్.. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. పక్కనే ఉండే బాలికను ప్రేమ పేరుతో వేధిస్తుండగా.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేసి పోక్సో కేసు ఫైల్ చేశారు. అతను అరెస్టు కాకముందే కుటుంబసభ్యులు అందరినీ చంపేస్తానని బెదిరించినట్టు తెలుస్తోంది. ‘మీ నాన్నను ఎలా చంపేశారో, మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని’ బాధితురాలి కుటుంబాన్ని రాజ్ కుమార్ గతంలో బెదిరించగా.. పోలీసులు అతన్ని లైట్ తీసుకున్నట్టు తెలిసింది. దీంతో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/2075805252876407028?s=20

నిందితుడిపై గతంలో వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్‌ను ఎందుకు ట్రేస్ చేయలేదని స్థానికులు ప్రశ్నించారు. బాధిత కుటుంబంలో మరో బాలిక వికలాంగురాలిగా ఉందని.. ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బంధువులు డిమాండ్ చేశారు.

#shabad#six murders#rajkumar#rangaressy#criminal escape
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి