మెదక్ జిల్లా రామాయంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. తన తల్లిని దూషించడంతో పాటు తనను కొట్టారని ఆవేదన చెందిన ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వివరాల్లోకివెళితే.. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ వారం రోజుల క్రితం ఓ యువతి, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో దుర్గా ప్రసాద్ (30) అనే వ్యక్తిని విచారణ నిమిత్తం పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అయితే, తన తల్లిని దూషించడంతో పాటు తనపై అమ్మాయి కుటుంబీకులు తీవ్రంగా దాడి చేశారని, అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని మనస్తాపం చెందిన ఆ యువకుడు.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోకి చొరబడ్డాడు.
https://x.com/pulsenewsbreak/status/2096954746871631987?s=20
మంటల్లో కాలిపోతున్న అతన్ని పోలీసులు రక్షించే ప్రయత్నం చేశారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చేతులెత్తేయడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశాడు. ఈ నెల 7న ఘటన చోటుచేసుకోగా.. తీవ్ర గాయాలతో మూడు రోజులు ప్రాణాలతో పోరాడిన దుర్గాప్రసాద్ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్టు తెలిసింది. దుర్గాప్రసాద్ మరణవార్త విని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
విషయం తెలియడంతో పోలీసులు మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నట్టు సమాచారం. ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. పోస్టుమార్టం అనంతరం బాడీని కుటుంబసభ్యులకు అందజేయనున్నట్టు తెలుస్తోంది. దుర్గాప్రసాద్ ఇకలేడు అనే విషయం తెలిసి అతని స్నేహితులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నట్టు సమాచారం.












