వైరల్ న్యూస్

Viral : ఆ చిన్నారి ఏం పాపం చేసింది తల్లి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

రచన: Kumar4 నిమిషాల పఠనం

కొందరు తల్లులు పేగు తెంచుకుని పిల్లలను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఆలోచించేలా చేస్తున్నది.అలాంటి తల్లులు మొత్తం మాతృత్వానికే చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేస్తున్నారు. ఒకరిద్దరు వలన అందరికీ ఆ మాట వస్తున్నది.

కొందరు తల్లులు పేగు తెంచుకుని పిల్లలను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఆలోచించేలా చేస్తున్నది.అలాంటి తల్లులు మొత్తం మాతృత్వానికే చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేస్తున్నారు. ఒకరిద్దరు వలన అందరికీ ఆ మాట వస్తున్నది. అసలు వీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? కుటుంబంలో గొడవలే కారణమా? ఆర్థికంగా వెనుకబాటుకు గురవ్వడమా? పిల్లలను పోషించే శక్తి లేక ఇలా చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉన్నది. కొందరైతై బిడ్డ పుట్టగానే చెట్లు, ముళ్ల పొదలు, డ్రైనేజీల్లో పడేస్తున్న ఘటనలు సైతం చాలానే వెలుగుచూశాయి.

ఆ సమయంలో ఆ మాతృ మూర్తులు ఒక్కసారి ఆలోచిస్తే బాగుండని, ఆ చిన్నారుల హృదయ వేదన తెలియడం లేదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉండగా, ఓ తల్లి చిన్నారిని ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ‘అమ్మా అమ్మా’ అంటూ ఆ చిన్నారని ఆస్పత్రిలో గుక్కపెట్టి ఏడుస్తున్న దృశ్యాలు అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలీలోని ఓ ఆసుపత్రిలో వెలుగుచూసింది.

https://x.com/pulsenewsbreak/status/2094231697437147286?s=20

వివరాల్లోకివెళితే.. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ఆస్పత్రికి రాగా.. ఓ బిడ్డను ఎమర్జెన్సీ వార్డులో వదిలేసి, మరో బిడ్డను తనతో తీసుకెళ్లింది.ఆకలితో అలమటిస్తున్న ఆ బాబు ‘అమ్మా అమ్మా’ అంటూ ఒకటే గుక్కపట్టి ఏడుస్తూ కనిపించాడు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఆ బాబుకు పాలు, బిస్కెట్లు, కొత్త బట్టలను అందించారు.

తింటున్న సమయంలోనూ మాటలు రాక ‘అమ్మా అమ్మా’ అంటూ ఏడుస్తున్న ఆ చిన్నారిని చూస్తే కన్నీళ్లు ఆగవు. తనకు అమ్మ కావాలి అన్నట్టు సైగలు చేస్తూ ఏడుస్తుంటే.. అమ్మ వచ్చేస్తుందిలేమ్మా, నువ్వు తిను అంటూ సిబ్బంది ఓదార్చారు. ఆపై పోలీసులకు సమాచారం అందించగా..అక్కడకు చేరుకున్న ఖాకీలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఆ బిడ్డ బాగోగులు శిశు సంరక్షణ అధికారులకు అప్పగించినట్టు సమాచారం.

#mother#left child#hospital#UP#viral video#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి