నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్ జీ నిర్వహించిన నిరసనల్లో రుచిక అనే పదిహేనెళ్ల బాలిక పాల్గొన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆమె తీవ్ర విమర్శలు చేయడంతో పాటు దుర్భాషలాడారు.అయితే, నాటి నుంచికొందరు గూండాలు కాల్ చేసి బెదిరిస్తున్నారని వాపోయింది. ఇంటి ఓనర్స్‌కు సైతం బెదిరింపులు రావడంతో వారు తమను ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది.
తాజాగా మరో వీడియో విడుదల చేసిన రుచిక.. మోడీ తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చేశారని ఆరోపించింది. తనకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది. ‘మోడీ ఓ పిరికివాడు.. నా జీవితాన్ని నరకంలా మార్చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ తనను ఎంతలా హింసించారంటే సర్వస్వం కోల్పోయా అంటూ రుచిక ఆవేదన వ్యక్తం చేసింది.
తాను తన స్వేచ్ఛను కోల్పోయానని, తల దాచుకొని బ్రతకాల్సిన దుస్థితి వచ్చింది అంటూ వ్యాఖ్యానించింది.ఇప్పుడు తన దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదని.. ఇక వెనక్కు తగ్గేదే లేదంటూ రుచిక హెచ్చరించింది. కాగా, ఢిల్లీలో జెన్-జీ నిరసన సమయంలో ప్రధాని మోడీని రుచిక అభ్యంతరక వ్యాఖ్యలు చేయగా... సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ప్రధాని మోడీ సైతం వరుసగా వీడియోలు చేశారు. జెన్ జీ నిరననల్లో తనను, తన తల్లిని దూషించారని అయినప్పటికీ వారందరినీ క్షమిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు.
https://x.com/pulsenewsbreak/status/2094221882853912722?s=20
అయితే, మోడీ క్షమించానని వీడియో సందేశంలో పేర్కొన్నా కొందరు గూండాలు రుచికకు బెదిరింపులు చేస్తూనే ఉండటంపై ఆమె తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే మోడీ తన జీవితాన్ని నరకంలా మార్చేశారని ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెకు మద్దతుగా పలువురు సంఘీభావం తెలుపుతున్నారు.











