తెలంగాణ

Cm Revanth : బీసీ లెక్కల్లో తేడాలుంటే సవరిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

రచన: Kumar••4 నిమిషాల పఠనం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన బీసీ కులగణన లెక్కల్లో తేడాలుంటే సవరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీసీలకు సామాజిక న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎవరూ చేయని సాహసం తమ ప్రభుత్వం చేసిందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన బీసీ కులగణన లెక్కల్లో తేడాలుంటే సవరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీసీలకు సామాజిక న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎవరూ చేయని సాహసం తమ ప్రభుత్వం చేసిందని చెప్పారు. ఏడాదిలోనే కులగణన పూర్తి చేసి తొలిసారిగా బీసీల జనాభా లెక్కలను తేల్చామన్నారు. ప్రస్తుత లెక్కల్లో ఎవరైనా తమ వివరాలు నమోదు కాలేదని భావిస్తే, వాటిని సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు.

అవసరమైతే బీసీ కులగణన లెక్కలను సరిచేసి, జాబితాలోకి రాని వారిని చేర్చుతామన్నారు. నగరంలోని రవీంద్రభారతిలో నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం ఈ సందర్బంగా కీలక వ్యాక్యలు చేశారు. ఏ కులం వారైనా తమ జనాభా లెక్కల్లో తక్కువగా నమోదైందని భావిస్తే సంబంధిత వివరాలు అందించాలని కోరారు. వచ్చే కేబినెట్ భేటీలో చర్చించి లెక్కలను మరింత పక్కాగా చేయిస్తామని తెలిపారు.అవకాశం ఉంటే తన కుర్చీ చుట్టూ బలహీనవర్గాలను కూర్చోబెట్టుకోవాలన్నది తన ఆలోచన అని సీఎం చెప్పారు.

బీసీ-ఏలోకి ముదిరాజ్‌లు.

ముదిరాజ్‌లను బీసీ-డీ జాబితా నుంచి బీసీ-ఏలోకి మార్చాలన్న డిమాండ్‌పై సీఎం స్పందించారు.ముదిరాజ్ నేతలు న్యాయ నిపుణులను సంప్రదించి బీసీ-ఏలో చేర్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అదే టైంలో గంగపుత్రులలో ఉన్న అపోహలను కూడా తెలుసుకోవాలన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముదిరాజ్ బిడ్డలకు అనేక అవకాశాలు కల్పించామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. మిగతా ముదిరాజ్ నాయకులకు కూడా త్వరలో అవకాశాలు వస్తాయని తెలిపారు.

నేను ఫాంహౌస్‌లో పడుకోను..

తనకు ఇంకా వయసు, ఓపిక ఉన్నాయని, ఫాంహౌస్‌లో పడుకునే రకాన్ని కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన పలువురికి పదవులు ఇచ్చామని, మిగిలిన వారికి కూడా త్వరలోనే అవకాశాలు కల్పిస్తామన్నారు.పండుగ సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆయన కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్న విగ్రహాలను ట్యాంక్‌బండ్‌ సమీపంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారి సేవలను స్మరించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, తమ ప్రభుత్వం కొత్తగా మరిన్ని పథకాలను అమలు చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు.

#cm revanth reddy#pandaga sayannaa jayanthi#mudiraj meeting#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి