వైరల్ న్యూస్

Viral : ప్రేమతో హగ్ ఇచ్చిన భర్త.. విరిగిన పక్కటెముకలు!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

భార్యభర్తలు ప్రేమతో కౌగిలించుకోవడం కామన్. ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్నత, ప్రేమానురాగాలను ఈ విధంగా వ్యక్తపరుస్తుంటారు. హగ్ చేసుకోవడం మూలంగా కపుల్స్ మధ్య ఉన్న దూరం చెరిగిపోతుంది. స్ట్రెస్ రిలీఫ్ అవ్వడంతో పాటు ఇద్దరి మధ్య బాండింగ్ మరింత బలపడుతుంది.

భార్యభర్తలు ప్రేమతో కౌగిలించుకోవడం కామన్. ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్నత, ప్రేమానురాగాలను ఈ విధంగా వ్యక్తపరుస్తుంటారు. హగ్ చేసుకోవడం మూలంగా కపుల్స్ మధ్య ఉన్న దూరం చెరిగిపోతుంది. స్ట్రెస్ రిలీఫ్ అవ్వడంతో పాటు ఇద్దరి మధ్య బాండింగ్ మరింత బలపడుతుంది. అందుకే నేటితరం లవర్స్, కపుల్స్ హగ్ చేసుకుని తమ భావాలను ఒకరినొకరు వ్యక్త పరుస్తుంటారు. సమయం దొరికనప్పుడల్లా హగ్ చేసుకుని మాట్లాడుకుంటుంటారు.

అయితే,ఓ భర్త తన భార్యను ప్రేమగా కౌగిలించుకోగా ఆమె పక్కటెముకలు విరిగాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో అక్టోబర్ 18న చోటుచేసుకున్నట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. తన భార్యపై ఉన్న ప్రేమను తెలియజేసేందుకు ఆ భర్త ఆమెను దగ్గరకు తీసుకుని గట్టిగా హగ్ చేసుకుని పైకి లేపాడు. ఆ సమయంలో టక్ మని శబ్దం రావడంతో పాటు ఆమెకు తీవ్రమైన వెన్నునొప్పి ఏర్పడింది.

బాధితురాలు నిటారుగా నిలబడలేనంత తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయింది. దీంతో తన భార్యను ఆసుప‌త్రికి తరలించాడు. వైద్యులు సిటీ స్కానింగ్ చేసి చూడగా 5 పక్కటెముకలు విరిగాయని, మరొక దానికి క్రాక్ వచ్చినట్లు చెప్పారు.డాక్టర్ల మాట విన్న భర్త‌కు నోట్లో నుంచి మాట రాలేదని తెలిసింది. హగ్ చేసుకుంటే ఎముకలు విరగడం ఏంటని ఆ భర్త షాక్‌లో ఉండిపోయాడు.

ఎముకల బలహీనత వల్లేనా?

అయితే, కౌగిలించుకోవడం వలన ఎముకలు విరగవని, దీనికి అసలు కారణం 'ఆస్టియోపొరోసిస్' అనే ఎముకల బలహీనత సమస్య అని వైద్యులు వెల్లడించారు. ఎముకలు తీవ్రంగా బలహీనపడటం వల్ల చిన్నపాటి ఒత్తిడికే విరిగిపోతాయని పేర్కొన్నారు. కాగా, బాధితురాలికి వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించివేశారు.కాగా, ప్రతి ఐదు రోజులకు ఒకసారి వైద్య పరీక్షలకు హాజరుకావాలని డాక్టర్లు సూచించారు.ప్రతిరోజూ ఎండలో నిలబడటంతో పాటు క్యాల్షియం సప్లిమెంట్లను తీసుకోవాలని వైద్యులు సజెస్ట్ చేశారు.

కాగా, తన భార్య ఎముకలు విరిగిన ఘటనపై ఆమె భర్త స్పందించాడు.తాను గట్టిగా కౌగిలించుకోలేదని, మాములుగానే చేసుకున్నానని చెప్పాడు. తన భార్య డైటింగ్‌లో ఉందని, అసలు ఆమెకు ఎండ తగలదని చెప్పాడు. హగ్ చేసుకోవడం వలన ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య బరువు కేవలం 45-50 కిలోలు మాత్రమే ఉందని, రాత్రి భోజనం మానేయడం, రోజూ కాఫీ తాగడం, ఎండ తగలకపోవడం వంటి రీజన్స్ వల్లే ఆమె ఎముకలు బలహీనపడి ఉంటాయని భర్త తెలిపారు.

#husband#hug to wife#bones breaked#china#bones issue#viralnews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి