క్రీడలు

VIRAL: దులీప్ ట్రోఫీ ఫైనల్.. వైభవ్ సూర్యవంశీని ఆటపట్టించిన తిలక్ వర్మ!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మైదాన పోరులో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్, 15ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య చోటుచేసుకున్న ఒక సరదా సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

 దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మైదాన పోరులో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్, 15ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య చోటుచేసుకున్న ఒక సరదా సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈస్ట్ జోన్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ ఆరంభం నుంచే సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడుతూ వేగంగా పరుగులు సాధించాడు. అతని మైండ్ గేమ్‌ను దెబ్బతీసేందుకు తిలక్ వర్మ వైభవ్ దగ్గరకు వెళ్లి "వైస్ కెప్టెన్.. ఏంటిది?" అంటూ సరదాగా ఆటపట్టించాడు.

 తిలక్ వర్మ స్లెడ్జ్ చేసినప్పటికీ, ఇద్దరూ నవ్వుకోవడంతో అది కేవలం మైదానంలో ఆటలో భాగమైన సరదా మైండ్ గేమ్ అని స్పష్టమైంది. అయితే, ఈ సరదా స్లెడ్జింగ్ తర్వాత అనూహ్యంగా వైభవ్ సూర్యవంశీ మైండ్ డైవర్ట్ అయి పెవిలియన్ దారిపట్టాడు. ధాటిగా ఆడుతున్న వైభవ్ 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియో క్లిప్ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

 ఈ మ్యాచ్‌లోకి వస్తే, టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్ జట్టుకు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ మంచి శుభారంభాన్ని అందించారు. అనుభవజ్ఞుడైన ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ నిలకడగా ఆడుతూ 72 పరుగులతో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. సుదీప్ కుమార్ (6) త్వరగానే నిష్క్రమించినప్పటికీ, ఈ వార్త రాసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసి రేసులో నిలిచింది. వైభవ్ సూర్యవంశీ (44), అభిమన్యు ఈశ్వరన్ (72) లతో పాటు శికార్ మోహన్ (85) పెవిలియన్ చేరినప్పటికీ, కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతమైన శతకంతో (111*) రాణించి జట్టు స్కోరును 350 మార్కు దాటించాడు.

 సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురన, వి.మిలింద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ తలొక వికెట్ పడగొట్టారు. ఫైనల్ మ్యాచ్ కావడం, ఇరు జట్లలోనూ నయా యువ సంచలనాలు, జాతీయ స్థాయి ఆటగాళ్ళు ఉండటంతో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ల మధ్య టైటిల్ పోరు అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. త్వరలోనే సౌత్ జోన్ బౌలర్లు ఈస్ట్ జోన్‌ను ఎంత తక్కువ పరుగులకు కట్టడి చేస్తారో వేచి చూడాల్సి ఉంది.

#DuleepTrophy2026#TilakVarma#VaibhavSuryavanshi#EastVsSouthZone#CricketNewsTelugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి