National

Delhi: కూలిన PG హోస్టల్.. శిథిలాల కింద చిక్కుకున్న 50 మంది విద్యార్థులు!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఆదివారం కావడంతో ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. విరామం తీసుకుంటున్న సమయంలో ఉన్నపళంగా భవనం కూలిపోవడంతో.. వారంతా శిథిలాల కిందే చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఇక ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, NDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

దేశ రాజధాని దిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. రెప్ప మూసి తెరిచేలోపే ఆ భవనం నేలమట్టమై, భారీగా శిథిలాలు పేరుకుపోయాయి. ఇక ప్రమాదం జరిగిన తీరు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. దిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు ప్రాక్సీమల్‌గా ఉండే ఈ భవనాన్ని విద్యార్థుల కోసం పేయింగ్ గెస్ట్ వసతి గృహంగా ఉపయోగిస్తున్నట్టు సమాచారం..

ఆదివారం కావడంతో ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. విరామం తీసుకుంటున్న సమయంలో ఉన్నపళంగా భవనం కూలిపోవడంతో.. వారంతా శిథిలాల కిందే చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఇక ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, NDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

రెస్క్యూ టీమ్‌లు శిథిలాలను వేగంగా తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే దిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాద స్థలంలో ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.

ఈ క్రమంలో భవనం కూలిపోవడానికి గల కారణాలపై వివిధ కోణంలో అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు.. ప్రస్తుతానికి ఘటనా స్థలంలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధానిలో భవనాలు కుప్పకూలి అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో లక్ష్మీనగర్‌లో జరిగిన దారుణ ఘటనలో ఓ ఐదంతస్తుల భవనం నేలమట్టమై 60 మందికి పైగా బలికాగా... చాందినీ మహల్, ముస్తఫాబాద్ ప్రాంతాల్లోనూ బలహీనమైన నిర్మాణాలు కూలి పలువురు ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా పర్మిషన్లు లేకుండా నిర్మించే అక్రమ కట్టడాలు, పాతబడిన భవనాలకు సరైన మరమ్మతులు చేయకపోవడమే ఈ వరుస ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోందనే ఆరోపణలున్నాయి..

#Delhi#PG Hostel#collapses#50 students#NDRF#Satya Niketan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి