తెలంగాణ

Konda Surekha: సురేఖను చేర్చుకునేది లేదంటున్న బీఆర్ఎస్‌, బీజేపీ.. ఆమె దారెటు?

రచన: Mahesh6 నిమిషాల పఠనం

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల కాంగ్రెస్ సర్కార్ ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. అయిన ప్రస్తుతం ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఆమె దీర్ఘకాలంలో హస్తం గూటిన ఉండే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల కాంగ్రెస్ సర్కార్ ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. అయిన ప్రస్తుతం ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఆమె దీర్ఘకాలంలో హస్తం గూటిన ఉండే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినప్పటికీ.. సురేఖ ఏ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడితే బీఆర్‌ఎస్, బీజేపీ ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బీఆర్‌ఎస్ మాత్రం సురేఖ విషయంలో ముందుగానే స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొండా సురేఖను తమ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్వానించబోమని తాజాగా పలువురు బీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సైతం సురేఖకు బీఆర్‌ఎస్‌లోనే కాదు.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకే అవకాశం లేదన్న స్థాయిలో వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాము బీఆర్‌ఎస్‌లో చేరతానని కొండా సురేఖ కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సురేఖ కుటుంబానికి, బీఆర్‌ఎస్‌కు గతంలో ఉన్న రాజకీయ సంబంధాలే ప్రస్తుత వైఖరికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో 2014 నుంచి 2018 వరకు సురేఖ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ టైంలో ఆమె భర్త కొండా మురళికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. అయితే 2018 ఎన్నికలకు ముందు టికెట్ల విషయంలో విభేదాలు తలెత్తడంతో కొండా కుటుంబం బీఆర్‌ఎస్‌ను వీడింది.

ఆ సమయంలో పార్టీ ముఖ్య నేతలపై సురేఖ చేసిన విమర్శలను బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికీ గుర్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక 2023లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో సురేఖను తిరిగి పార్టీలోకి తీసుకుంటే కార్యకర్తలు, నాయకులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయం బీఆర్‌ఎస్‌లోని కొందరు నేతల్లో ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో మాజీ మంత్రి కొండా సురేఖకు బీజేపీ ద్వారాలు కూడా మూసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె కమలం గూటికి చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్‌రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సురేఖ బీజేపీలో చేరబోతున్నారనే వార్తలను తోసిపుచ్చారు. పార్టీలో చేరికల విషయంలో బీజేపీకి స్పష్టమైన విధానం ఉందని పేర్కొంటూ.. “ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోబోం” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం కొనసాగుతోందని.. ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ప్రచారాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు.

ఇదే సమయంలో కొండా సురేఖ బీజేపీలో చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మురళీధర్‌రావు చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. సురేఖ చేరికపై ఇప్పటివరకు కొనసాగుతున్న ఊహాగానాలకు ఆయన వ్యాఖ్యలు ఒకింత స్పష్టత ఇచ్చినట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రలు ఉండరనే వాదన కూడా లేకపోలేదని చెబుతున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ వారి వారి రాజకీయ వ్యూహంలో భాగంగా కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి మాత్రం కొండా సురేఖ విషయంలో ఇటు బీఆర్‌ఎస్, అటు బీజేపీ నేతల వైఖరి మాత్రం ‘నో ఎంట్రీ’ అన్నట్లుగా కనిపిస్తోంది.

#Konda Surekha#Telangana Politics#Telangana Congress#Congress#BRS#BJP#Konda Murali#Jagadish Reddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి