తెలంగాణ

TG Politics: సురేఖ బర్తరఫ్‌.. వాళ్లందరికీ రేవంత్ సైలెంట్ వార్నింగ్‌..?

రచన: Mahesh4 నిమిషాల పఠనం

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ బర్తరఫ్‌ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం వెనుక పార్టీ క్రమశిక్షణ అంశం మాత్రమే కాకుండా.. తనపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఒక పరోక్ష సందేశం ఇచ్చారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.

TG Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ బర్తరఫ్‌ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం వెనుక పార్టీ క్రమశిక్షణ అంశం మాత్రమే కాకుండా.. తనపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఒక పరోక్ష సందేశం ఇచ్చారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డిపై కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మరికొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వివిధ సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ వ్యవహారాలపై తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. అయితే ఇప్పుడు అధిష్ఠానం కొండా సురేఖపై తీసుకున్న చర్యతో, ముఖ్యమంత్రి నాయకత్వంపై, కాంగ్రెస్ పార్టీ పాలనపై బహిరంగంగా ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసే వారు ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండాలనే సంకేతం వెళ్లిందా? అనే చర్చ ఇప్పుడు ప్రముఖంగా జరుగుతోంది.

ముఖ్యంగా పార్టీ, ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న మంత్రి.. సీఎం నాయకత్వంలో పనిచేస్తూ బహిరంగంగా వివాదానికి కేంద్రంగా మారితే చర్యలు తప్పవనే మెసేజ్‌ను సురేఖ వ్యవహారం ద్వారా ఇచ్చారనే విశ్లేషణలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. సురేఖ ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డిపై బహిరంగ విమర్శలు చేస్తున్న నేతల వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇప్పటి వరకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించిన ఆ నేతలు.. సురేఖపై అధిష్ఠానం తీసుకున్న చర్యతో తమకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందనే ఆలోచన చేస్తారా? లేక తమ మాటలను గతంలో చెప్పినట్లుగానే కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి. మొత్తంగా కొండా సురేఖ బర్తరఫ్‌ ఒక వ్యక్తిపై తీసుకున్న చర్యగానేనా? లేక కాంగ్రెస్‌లో అంతర్గత క్రమశిక్షణకు రేవంత్‌రెడ్డి గట్టి సంకేతం ఇచ్చారా? అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

#TG Politics#Telangana Politics#Konda Surekha#Revanth Reddy#Telangana Congress#Congress#Congress Internal Politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి