National

Pune: MPSC అక్రమాలపై సమరభేరి.. విద్యార్థుల పోరుకు CJP అభిజిత్ దీప్కే మద్దతు!

రచన: Venu5 నిమిషాల పఠనం

అక్టోబర్ 25న జరగబోయే గ్రూప్-సి ప్రిలిమ్స్ పరీక్షను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, రద్దు చేసిన స్టెనోగ్రాఫర్ పోస్టును తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత వచ్చే వరకు, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు.

మహారాష్ట్రలో పోటీ పరీక్షలు రాస్తున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది! MPSC పరీక్షల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన అభ్యర్థులకు మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ రంగంలోకి దిగింది. పుణేలోని ఓంకారేశ్వర్ మందిర్ చౌక్ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు జరగనున్న విద్యార్థి ఆక్రోశ్ మోర్చాకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని CJP అధినేత అభిజిత్ దీప్కే ఎక్స్ వేదికగా వెల్లడించారు..

ఈ ఉద్యమంలో విద్యార్థులు మరియు CJP ప్రధానంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. MPSC అధ్యక్షుడు, కార్యదర్శి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని, వారి స్థానంలో నీతి, నిజాయితీ కలిగిన అధికారులను నియమించాలని కోరారు. గ్రూప్-బీ పరీక్షలోని అభ్యంతరాలపై ఎనిమిది రోజుల్లోగా స్పష్టతనిచ్చి, జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, రాజ్యసేవ మెయిన్స్ 2025, వ్యవసాయ సేవల డిస్క్రిప్టివ్ పేపర్ల మూల్యాంకనంలో దొర్లిన పొరపాట్లపై వెంటనే విచారణ చేపట్టాలన్నారు. మరోవైపు, ముంబై క్రైమ్ బ్రాంచ్ MPSCకి సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదికను వెంటనే బహిరంగపరచాలని CJP డిమాండ్ చేసింది. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు, అండర్ సెక్రటరీ అభిజీత్ లెండే పదవీకాలంలో నిర్వహించిన అన్ని పరీక్షలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని స్పష్టం చేశారు.

నిందితులు లెండే, మరాఠే, నఖాతేల సర్వీస్ కాలం, వారి పదోన్నతుల ప్రమాణాలపై లోతైన దర్యాప్తు చేపట్టాలని, వీరి కాంటాక్ట్‌ల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల కాల్ డేటా రికార్డ్స్‌ను కూడా నిశితంగా పరిశీలించాలని సూచించారు. దీంతో పాటు ప్రవీణ్ పాటిల్, మయూర్ ఠాక్రేలతో పాటు ఈ కుంభకోణంలో ఇతర ఏజెంట్ల ప్రమేయంపై స్వతంత్ర విచారణ జరగాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. DI విభాగంలోని అనుమానాస్పద ఫలితాలు, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులపై ప్రత్యేక ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్నారు.

అలాగే అక్టోబర్ 25న జరగబోయే గ్రూప్-సి ప్రిలిమ్స్ పరీక్షను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, రద్దు చేసిన స్టెనోగ్రాఫర్ పోస్టును తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత వచ్చే వరకు, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. మరోవైపు అధికారిక వ్యవస్థల్లో పాతుకుపోయిన అవినీతిపై కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పటికప్పుడు నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది..

గతంలో కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న ఎందరో అధికారుల అక్రమాలను CJP ఎండగట్టింది. ప్రజా ఉద్యమాల ద్వారా వారిని దిగివచ్చేలా చేసి, రాజీనామాలు చేసేలా ఒత్తిడి తెచ్చిన చరిత్ర CJPకి ఉంది. అదే ఊపుతో, ఇప్పుడు MPSC అక్రమార్కుల ఆట కట్టించేందుకు, విద్యార్థుల వైపు నిలబడి మరో పోరాటానికి సిద్ధమైంది..

#Maharashtra#Pune#CJP#MPSC#Abhijit Deepke#supports#students
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి