సినిమా

The Paradise: ది ప్యారడైజ్ ప్రమోషన్లు డల్‌.. నాని కావాలనే తగ్గించాడా?

రచన: Mahesh4 నిమిషాల పఠనం

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది.

The Paradise: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉన్నా ఇప్పటి వరకు ప్రమోషన్లు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చర్చ మొదలైంది.

సినిమా విడుదల తేదీపై ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ నాని పెద్దగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో కనిపించకపోవడం, సినిమా గురించి భారీగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు తక్కువగా ఉండటంపై అభిమానుల్లో నిరాశ నెలకొంది. అసలు నాని కావాలనే ప్రమోషన్లను తగ్గిస్తున్నారా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నాని ఈ సినిమా ప్రమోషన్స్‌ను తగ్గించడానికి ఓ ఆసక్తికరమైన కారణం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కొన్ని సినిమాలకు రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసినా.. థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో ఇప్పుడు నాని తన స్ట్రాటజీని మార్చుకున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టాక్సిక్’ సినిమా భారీ అంచనాలు, హైప్ మధ్య రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో.. ‘ది ప్యారడైజ్’ విషయంలో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో అంచనాలను విపరీతంగా పెంచడం కంటే.. సినిమాలోని కంటెంట్‌ను థియేటర్లలో ప్రేక్షకులకు నేరుగా చూపించి, మౌత్ టాక్‌తో సినిమాను పెద్ద హిట్ చేయాలన్నది నాని ఆలోచన కావచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సినిమా రిలీజ్‌కి మరో 15 రోజు టైం ఉండటం వల్ల ఆ గ్యాప్‌లో జోరుగా ప్రమోషన్లు చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఇక ‘దసరా’ తర్వాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ కావడం, 1980ల సికింద్రాబాద్ నేపథ్యంలో కథ సాగడం, నాని పవర్‌ఫుల్ ‘జడల్’ పాత్రలో కనిపించనుండటంతో ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో భారీ ఆసక్తిని పెంచుతున్నాయి. మరి తక్కువ ప్రమోషన్లతోనే ‘ది ప్యారడైజ్’ థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

#The Paradise#Nani#Srikanth Odela#Nani The Paradise#The Paradise Movie#Dasara#Nani Movies#Telugu Cinema#Tollywood#Telugu Movies#Action Thriller
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి