‘జర్నలిస్ట్‌పై కేసు’ అని కప్పిపుచ్చుకునేందుకేనా ఈ తాపత్రయం!
నాకు, మీకు ఏమైనా వ్యక్తిగత కక్ష లేదుగా?
వ్యవస్థ బాగు కోసమే నా తపన !
అవినీతి, అక్రమాలు లేని తెలంగాణ కోసం మీరేం చేశారో.. నేనేం చేశానో తెలంగాణ సమాజానికి చూపిద్దాం
లక్షల్లో జీతాలు, చుట్టూ పది మంది సేవకులతో మీరు.. ఒంటరి పోరాటంతో వందల కోట్ల ప్రభుత్వ ఆస్తులు కాపాడిన నేను
రాష్ట్రంలో పొస్టింగ్‌లు అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తూ కలరింగ్ ఇచ్చే కళాకారుల గురించి మాట్లాడుకుందాం?
మీ అధికారాలను పక్కన పెట్టి రండి
ఒత్తిళ్లతో కేసులు పెడితే రేపు సమాజానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది
స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డిపై కుట్రలు పన్నే ముందు పదిసార్లు ఆలోచించండి
పేరు, నంబర్ ఇచ్చి మీలాంటి పెద్దలపై ఫొటోలతో సహా వార్తలు రాస్తున్నా అంటే ఆరోపణలకు ఆధారాలు ఉంటాయని గ్రహించండి
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809,
స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్.
వైరల్ అయిన ఎక్స్ పోస్ట్.. సంచలనంగా మారిన వార్త
తెలంగాణలో ఐపీఎస్ సజ్జనార్ తెలియని వారుండరు. ఎక్కడ పని చేసినా తనదైన మార్క్ చూపించుకుంటూ వచ్చారు. ఇన్నాళ్లు ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన తెర వెనుక వ్యవహారశైలిని సైతం తెలంగాణ ప్రజలు గమనిస్తూ వచ్చారు. ఎంత ప్రచారం జరిగితే అంత ఫోకస్ ఉంటుంది. అలాంటి అధికారిపై అనేక ఆరోపణలు వస్తుంటే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా నాపై ఉంటుంది. తప్పు అయితే నా వార్తతో మీ ఉద్యోగం పోదు. అదే ఆరోపణలో 40శాతం నిజం అయినా మీ అత్మ ప్రశ్నిస్తుంది.
బ్యూరో క్రాట్స్ చేసే తప్పిదాలను ఎత్తి చూపకపోతే ఒక్కరిని చూసి మరో అధికారి బరితెగించి అవినీతికి, అక్రమాలకు పాల్పడుతారని జనం వాపోతున్నారు. అందుకే తెలంగాణలో అక్రమాలను తగ్గించేందుకు మీ కంటే ఎక్కవ రాత్రింబవళ్లు కష్టపడి ప్రభుత్వ భూములను, వ్యవస్థలో ఉండే కొంతమంది కళాకారులను గుర్తించి వాళ్ల అసలు రూపాన్ని బయటపెడుతున్నా. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలని స్వేచ్ఛగా స్వేచ్ఛ న్యూస్ హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇది సమాజానికి ఎంతో మంచిది కూడా. ఇన్వెస్టిగేషన్ కథనాలతో కొంతైనా మార్పు రావాలని ఒంటరి పోరాటం చేస్తున్నందుకు మీకు అధికారులకు బాధగా ఉండవచ్చు. ఫ్రస్ట్రేషన్ రావొచ్చు. ఇన్నాళ్లూ కాపాడుకున్న పేరును నాశనం చేశారని చంపేంత కోపం రావొచ్చు. కానీ ప్రశాంతంగా చర్చించుకుని ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.
తోటి జర్నలిస్టులు తప్పని ఎందుకు మందలించలేదు?
ఒక్క మంచి ఆఫీసర్‌పై బదిలీ అయిన బాధలో ఉన్నప్పుడు ఆరోపణలతో వార్తలు రాస్తే తోటి మీడియా మిత్రులు, సీనియర్ జర్నలిస్టులు ఫోన్ చేసి చివాట్లు పెడుతుంటారు. ఎవరైనా మంచి ఆఫీసర్‌పై కావాలని దుమ్మెత్తి పోస్తే, చూసుకొని రాయాలని నేనే ఎంతోమందికి చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ అంత పెద్దగా అధికారికంగా ట్వీట్ చేసినా, వెబ్‌లో వార్త రాసినా నిత్యం మీ చుట్టూ ఉండే జర్నలిస్టుల్లో ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. కనీసం ఎందుకు ఇలా రాశావని అడగలేదు. పైగా ఫోన్స్ చేసి మేము రాయలేని తీరులో నువ్వు రాశావని మెచ్చుకున్నారు. అంటే రోజు మిమ్మల్ని కలిసే జర్నలిస్టు మిత్రులే అలా అడగకుండా ఉండిపోయారనేది గుర్తుంచుకోండి సార్. వ్యవస్థపై ఉన్న అభిమానంతోనే వార్తలు రాయాల్సి వచ్చిందని తెలుసుకోండి.
నిక్కచ్చిగా చేసిన ఆరోపణలపై సమాధానాలు కావాలి బాస్
1. అమీన్ పూర్‌లో సీఐగా శ్రీనివాసులు రెడ్డి ఉన్నప్పుడు ఓ మహిళ.. భర్త ఇబ్బందులు పెడుతున్నాడని వెళితే లొంగదీసుకుని, అబార్షన్స్ చేయించింది వాస్తవం కాదా?
2. ఆ సీఐ వేధింపులపై నవంబర్ 6నే మీకు సమాచారం చేరవేశారు. 18న మీరు చర్చించినట్లు సమాచారం.
3. ఎవ్వరిని ఎవ్వరు ఆర్థికంగా ఉపయోగించుకున్నారో వాళ్ల వ్యక్తిగతం.. కానీ ప్రాథమిక నేరం జరిగిన తీరు ఎందుకు గుర్తించలేదు?
4. లైంగిక ఆరోపణలు ఉన్న ఎస్‌ఆర్ నగర్ ట్రాఫిక్ సీఐని సైఫాబాద్ స్టేషన్‌కు ఎస్‌హెచ్ఓగా చేసింది నిజం కాదా?
5. 20రోజుల్లోనే ఎలాంటి వ్యవహారాలు లేకుండా ఒక్క స్టేషన్ నుంచి మరో కాస్ట్లీ స్టేషన్ ఎస్‌హెచ్ఓగా మార్చారంటే ఆయనలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి?
6. అబార్జన్ చేసి అన్యాయం చేశారని ఆధారాలతో మీరు పట్టించుకోవడం లేదని జూన్‌లో డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేస్తేనే కదా అగస్ట్ 6న అదే అమీన్ పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ అయింది.
7. ఓ పత్రికలో వార్త వచ్చాక బదిలీ చేసి చేతులు దులుపుకుందామనుకోలేదా? ఆడియోలు, హాస్పిటల్ బిల్లులు బయటకు రావడంతో కదా సస్పెండ్ చేసింది.
8. సుప్రీంకోర్టులో ఆరోగ్యం బాగాలేదని స్టే ఇచ్చేంత వరకు, అనగా 47రోజులు అబ్‌స్కాండ్‌లో ఉన్నారని చెప్పింది మీ ఒత్తిడితో కాదా?
9. జూలైలో ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు రూ.25లక్షలతో జూబ్లీహిల్స్ పోస్టింగ్ పొందారని ఆ బాధిత మహిళ డీజీపీకి, సీఎంకి వాట్సాప్ ద్వారా తెలియజేస్తే, మీ సీసీ శ్రీధర్ పాత్రపై 5నెలలుగా ఎందుకు విచారణ జరిపి నిగ్గు తేల్చలేకపోయారు. ఆమె చెప్పింది అబద్ధం అయితే ఆనాడు రాసిన పత్రికకు ఎందుకు రీజాయిండర్ ఇచ్చుకోలేదు.
10. ఆడవాళ్లకు అండగా ఉండేది ఒక్క సజ్జనార్ సారే అనే మెసేజ్ తెలంగాణ సమాజంలో ముద్ర వేసుకున్నారు. ఆ ముద్ర ఈ సీఐ కేసులో ఎందుకు కనబర్చలేదు?
11. ఇన్‌స్పెక్టర్‌ని ఆమె మనీ కోసం వాడుకుందని తేలితే, ఎలా లొంగదీసుకున్నారో, అబార్షన్ ఎలా అయింది మర్చిపోయి ముఖ్యమైన స్టేషన్స్‌లో పోస్టింగ్ ఇస్తే తెర వెనుక ఆరోపణల్లో నిజాలు లేవని అనుకోవాలా?
మీ 30 ఏండ్ల సర్వీస్‌లో మీరు ఎంతో కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నారని ఇన్నాళ్లూ తెలంగాణ ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండాలంటే చివర్లో ఇంకా ఎంతో బాధ్యతగా ఇలాంటి కేసులపై కూడా ఉండాల్సింది. కానీ కేసుకో రేటులా కింది సిబ్బంది తయారు అయ్యారంటే ఎవ్వరు కారణమో గుర్తుచేసుకోండి? మీ 30 ఏండ్ల అనుభవం, నా 20 ఏండ్ల క్రైం, ఇన్వెస్టిగేషన్ జర్నలిజంపై దేనికైనా సిద్ధమే. మీ అధికారంతో కేసులతోనే చూసుకుందాం అంటే ప్రతి ఆరోపణ వెనుక నిజాలు ఏంటో ఇలా రోజూ పబ్లిక్‌గానే చర్చిద్దాం.


