చికెన్ ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. మొన్నటివరకు కేజీకి రూ.300 నుంచి 320 వరకు పలికిన చికెన్.. కార్తీకమాసం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. ఈ మాసంలో చాలా మంది నాన్ వెజ్‌కు దూరంగా ఉంటారు. దీంతో డిమాండ్ పడిపోవడంతో సప్లయ్ పెరిగి ధరలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. కార్తీకమాసంలో తొలి ఆదివారం(నేడు) కిలో చికెన్‌పై ఏకంగా రూ. 50 నుంచి రూ. 80 వరకు ధర తగ్గింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు సమాచారం. డిమాండ్ పడిపోవడంతో పౌల్ట్రీ వ్యాపారులు ధరలను తగ్గించక తప్పలేదని తెలుస్తోంది. గత ఆదివారం రూ.300పైగా పలికిన స్కిన్‌లెస్ చికెన్ ధరలు నేడు చాలా ప్రాంతాల్లో రూ.260లోపే విక్రయిస్తున్నారు. తెలంగాణలోని ప్రధాన నగరాలు, హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.260 నుంచి రూ. 270 వరకు అమ్ముతున్నారు.వరంగల్‌లో రూ.250 నుంచి రూ.260, కామారెడ్డిలో రూ.260, నిజామాబాద్‌లో రూ.200 నుంచి రూ.260 మధ్య విక్రయిస్తున్నట్టు తెలిసింది.
ఏపీలోనూ ధరలు దిగివచ్చాయి.ప్రకాశం జిల్లాలో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 260 పలుకుతుండగా, నంద్యాల జిల్లాలో రూ. 240 నుంచి రూ. 250 వరకు ఉంది. విజయవాడలో రూ.220 నుంచి రూ.230 మధ్య విక్రయిస్తున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో రూ. 220 వరకే చికెన్ అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. రవాణా ఖర్చులు తక్కువగా ఉన్న చోట చికెన్ ధరలు మరింత తగ్గినట్టు సమాచారం.
కార్తీకమాసం ముగిసే వరకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఇలాగే కొనసాగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ధరలు దిగిరావడంతో నాన్ వెజ్ ప్రియులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.కాగా, అమ్మకాలు మందగించడంతో పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు కొంత నిరాశలో ఉన్నట్టు సమాచారం. చికెన్ ధరలు తగ్గినా మటన్, చేపల ధరలు మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.


