సినిమా

Tollywood: అదుర్స్ లాంటి కథతో అనిల్-ఎన్టీఆర్..!

4 నిమిషాల పఠనం

Tollywood: మన టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లను ప్రకటించిన వెంటనే అంచనాలు ఆకాశాన్ని అంటుకుంటాయి. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషనే ఎన్టీఆర్, అనిల్ రావిపూడిలది కావడం విశేషం. ఇప్పటివరకు.. యాక్షన్, మాస్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సాధించుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు మళ్లీ తనలోని కామెడీ టైమింగ్‌ను బయటకు తీసేందుకు అనిల్ రావిపూడి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్ తోడవడంతో ఈ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.

అదుర్స్‌ను మించిన కామెడీ ఉంటుందా? మరి ఎమోషన్స్!

ఎన్టీఆర్ కెరీర్‌లో 'అదుర్స్' సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉందని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా, చారి పాత్రలో తారక్ పండించిన కామెడీ ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటుంది. బ్రహ్మానందంతో కలిసి ఆయన చేసిన సీన్స్ అన్నీ అదుర్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఆ తర్వాత, కూడా 'బృందావనం' వంటి సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు తారక్.

అయితే, గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ ఎక్కువగా యాక్షన్ ప్రధానమైన కథలనే చేస్తున్నాడు. కొన్ని సినిమాలలో మరీ సీరియస్‌నెస్ కనిపించింది. దీంతో మళ్లీ ఆయనను పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌లో చూడాలని నందమూరి అభిమానులు, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి, సినిమా ఇప్పుడు అనిల్ రావిపూడితో సెట్ అయింది. తాజా సమాచారం మేరకు, అదుర్స్ ని మించిన కామెడీతో పాటు ఎమోషన్స్‌కి ప్రాధాన్యం ఇస్తూ అనిల్ రావిపూడి కథను తయారు చేసినట్టుగా తెలుస్తోంది.

కల్యాణ్ రామ్ నిర్మాణంలో మరో భారీ చిత్రం!

ఇక, ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నాడు. గతంలో అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమైన 'పటాస్' సినిమాను కూడా కల్యాణ్ రామే నిర్మించాడు. ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్‌ను ఆధించింది. ఇప్పుడు అదే దర్శకుడు తన తమ్ముడు ఎన్టీఆర్‌తో సినిమా చేయడం మరో ఆసక్తికరమైన విషయం. కాగా, ప్రస్తుతం అనిల్ జనవరి 12 విడుదల సినిమాతో తారక్ ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇవి, పూర్తి కాగానే అనిల్-తారక్‌ల ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

#NTR#Anil Ravipudi#Kalyan Ram#NTR Arts#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి