సినిమా

Tollywood: వారణాసి, ధర్మన్ సినిమాలపై వస్తున్నవన్నీ రూమర్సేనా?

5 నిమిషాల పఠనం

Tollywood: ఒకటి పాన్ వరల్డ్ సినిమా..ఇంకోటి పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ ఉన్న సినిమా. ఈ రెండు సినిమాల విషయంలో తాజాగా ఓ ప్రచారం ఊపందుకుంది. అదేమిటంటే, అనూహ్యంగా ఈ రెండు సినిమాలు విడుదల వాయిదా పడబోతున్నాయి అని. ఇంతకీ, ఆ సినిమాలేవంటే సూపర్ స్టార్ మహేష్ బబౌ నటిస్తిన్న వారణాసి..కోలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్న ధర్మన్. ఈ రెండు సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ కానున్నాయని సమాచారం.

Tollywood: ఒకటి పాన్ వరల్డ్ సినిమా..ఇంకోటి పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ ఉన్న సినిమా. ఈ రెండు సినిమాల విషయంలో తాజాగా ఓ ప్రచారం ఊపందుకుంది. అదేమిటంటే, అనూహ్యంగా ఈ రెండు సినిమాలు విడుదల వాయిదా పడబోతున్నాయి అని. ఇంతకీ, ఆ సినిమాలేవంటే సూపర్ స్టార్ మహేష్ బబౌ నటిస్తిన్న వారణాసి..కోలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్న ధర్మన్. ఈ రెండు సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ కానున్నాయని సమాచారం.

ఏప్రిల్ నుంచి ఆగస్టుకు "వారణాసి" పోస్ట్ పోన్?

మన టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా ప్రతీ ఒక్కరి చూపు రాజమౌళి రూపొందిస్తున్న 'వారణాసి' సినిమా మీదే ఉంది. అయితే, ఈ గ్లోబల్ అడ్వెంచర్ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ, తాజాగా సమాచారం మేరకు ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయంటున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టుకు రిలీజ్ డేట్ మారే అవకాశాలున్నాయట. దీనికి అసలు కారణం భారీ స్థాయిలో జరుగుతున్న వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకనే అని తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఈ వాయిదా వార్తలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

"ధర్మన్‌"కు కలిసొచ్చే అవకాశం ఉందా?

మరోవైపు, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'ధర్మన్' సినిమా కూడా 2027 సమ్మర్ కి వాయిదా పడనున్నట్టుగా తెలుస్తోంది. కమల్ హాసన్ నిర్మాతగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తమిళ ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా, తమిళ నూతన సంవత్సరం కానుకగా ఏప్రిల్ 14న ధర్మన్ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వాస్తవానికి, ఈ సినిమాను 2027, సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు వారణాసి పోస్ట్ పోన్ అయితే ఆ డేట్‌లో లేదా ఓ వారం తర్వాత ధర్మన్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

"ధర్మన్‌"కు ఏప్రిల్ కావాలంటే "వారణాసి" తప్పుకుంటేనే!

ఏప్రిల్ 7న వారణాసి వస్తే, ఈ గ్లోబల్ మూవీ కోసం భారీ స్థాయిలో థియేటర్లు కేటాయించడం పక్కా. ఎందుకంటే 120 దేశాలలో 50 భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కావడంతో.. నిర్మాతలు రిలీజ్ పరంగా వెనుకడుగు వేసే పరిస్థితి ఉండదు.

ఒకవేళ వారణాసి నిజంగానే వాయిదా పడితే మాత్రం సమ్మర్ బాక్సాఫీస్ రేసులో ధర్మన్‌కు భారీ స్థాయిలో స్క్రీన్స్ దక్కుతాయి. ముఖ్యంగా, ఏప్రిల్ 14 తమిళ నూతన సంవత్సర సెలవును బాగా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ ఆసక్తిరమైన విషయం ఏమిటంటే ఇంకా, ధర్మన్ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోవడం. చూడాలి, మరి వారణాసి-ధర్మన్ సినిమాల విషయంలో ఏం జరగనుందో.

#Super Star Mahesh Babu#Varanasi#SS.Rajamouli#uper Star Rajinikanth#Dharman#Kamal Haasan#Ashwath Marimuthu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి