తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇన్‌ఛార్జ్
మీనాక్షి ప్లేస్‌లో బి.ఎం. సందీప్
మూడేళ్లలో నలుగురు ఎందుకు మారారు..?
2028 ఎన్నికల వరకు ఈయనేనా..?
తెలంగాణలో కాంగ్రెస్ పవర్‌లో ఉంది. సీఎం ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ రూల్‌కు చెక్ పెట్టి అధికారాన్ని కూడా పట్టేసింది. కానీ పార్టీ విషయంలో మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఫుల్ హ్యాపీగా లేనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే.. తెలంగాణ కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జ్‌లు మారుతూనే ఉన్నారు.
2023 జనవరిలో మాణిక్కం ఠాగూర్ ప్లేస్‌లో మాణిక్‌రావ్ ఠాక్రే వచ్చారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఠాక్రే ప్లేస్‌లో దీపా దాస్‌మున్షీ బాధ్యతలు తీసుకున్నారు. 2025 ఫిబ్రవరిలో దీపా దాస్‌మున్షీ ప్లేస్‌లో మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఇప్పుడు 2026 నవంబర్‌లో మీనాక్షి ప్లేస్‌లో బి.ఎం. సందీప్‌ను అపాయింట్ చేశారు. అంటే.. కేవలం మూడేళ్లలో నలుగురు ఇన్‌ఛార్జ్‌లు చేంజ్ అయ్యారన్నమాట!
ఇది జస్ట్ పోస్టుల మార్పా? ఎలక్షన్స్ తర్వాత జరిగే నార్మల్ రొటేషనా ? లేక తెలంగాణ కాంగ్రెస్‌లో సెట్ కాని ఇష్యూస్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ డిస్కషన్‌గా మారింది.
అసలు ఇన్‌ఛార్జ్‌ల మార్పులు ఎందుకు..?
ఒక స్టేట్‌లో కాంగ్రెస్ పవర్‌లో ఉన్నప్పుడు సీఎం గవర్నమెంట్‌ను రన్ చేస్తారు. పీసీసీ ప్రెసిడెంట్ స్టేట్ పార్టీ వ్యవహారాలను చూసుకుంటారు. కానీ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ రోల్ వీళ్లిద్దరి మధ్య కోఆర్డినేషన్ చేయడం మాత్రమే కాదు. గ్రౌండ్ లెవల్‌లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో హైకమాండ్‌కు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇవ్వడం, లీడర్ల మధ్య గొడవలు రాకుండా హ్యాండిల్ చేయడం, పార్టీ డెసిషన్స్, ఎలక్షన్ స్ట్రాటజీస్.. ఇలా చాలా కీ రోల్స్ ఆయనపై ఉంటుంది. అందుకే పవర్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జ్ పోస్ట్ ఇంత క్రేజీగా, ఇంపార్టెంట్‌గా మారింది.
ఇన్‌ఛార్జ్‌లు మారుతున్నారు.. మరి ఇష్యూస్ మారుతున్నాయా?
2023లో మాణిక్‌రావ్ ఠాక్రే ఛార్జ్ తీసుకున్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో లీడర్ల మధ్య గొడవలు, అసంతృప్తులు బాగా ఉండేవి. వాటిని సెట్ చేయడమే ఆయన ముందున్న బిగ్ ఛాలెంజ్. ఆ తర్వాత ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ గెలిచి పవర్‌లోకి వచ్చింది. కానీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక కూడా ఇన్‌ఛార్జ్‌ల మార్పులు ఆగలేదు. 2023 డిసెంబర్‌లో దీపా దాస్‌మున్షీ వచ్చారు. 2025 ఫిబ్రవరిలో మీనాక్షి నటరాజన్ ఛార్జ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆమె ప్లేస్‌లో బి.ఎం. సందీప్ వచ్చారు.
ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కొద్దిరోజుల కిందటే తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఓపెన్‌గా బయటపడ్డాయి. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే మధ్య జరిగిన ఇష్యూ పార్టీ పెద్దల వరకు వెళ్లినట్లు వార్త వచ్చింది. స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ వివరణ అడగడం, హైకమాండ్‌కు రిపోర్ట్ పంపే ప్రక్రియ జరిగినట్లు కూడా టాక్ నడిచింది. అంతేకాదు.. కొందరు లీడర్ల ఓపెన్ కామెంట్స్‌పై హైకమాండ్ రిపోర్ట్ అడిగినట్లు వార్తలు వచ్చాయి. అంటే కొత్త ఇన్‌ఛార్జ్ ఛార్జ్ తీసుకునే టైమ్‌కి పార్టీలో ఇంటర్నల్ గొడవల విషయం కూడా హైకమాండ్ ఫోకస్‌లో ఉందని క్లియర్‌గా తెలుస్తోంది.
సందీప్ ముందున్న అసలు పరీక్ష ఇదే!
కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన బి.ఎం. సందీప్‌కు పార్టీ ఆర్గనైజేషన్ నడిపించడంలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐతో తన పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు. స్థానిక సంస్థల్లో పనిచేశారు. ఏఐసీసీ సెక్రటరీగా మహారాష్ట్ర, గుజరాత్ వ్యవహారాలు చూశారు. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లోనూ కాంగ్రెస్ తరఫున కీ రోల్ ప్లే చేశారు.
అయితే కర్ణాటకలోనో, కేరళలోనో పనిచేసిన ఎక్స్‌పీరియన్స్ తెలంగాణలో ఎంతవరకు వర్కవుట్ అవుతుందన్నది చూడాలి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్‌లో సమస్యలు కేవలం పార్టీ పోస్టుల దగ్గరే ఆగడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా స్థాయి లీడర్ల మధ్య సమన్వయం కూడా చాలా కీలకంగా మారింది. పవర్‌లో ఉన్న పార్టీ కాబట్టి.. ప్రభుత్వంపై జనాల్లో ఉన్న అంచనాలను పార్టీ ప్రోగ్రామ్స్‌తో బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది.
హైకమాండ్ సందీప్‌కు ఏ టాస్క్ ఇవ్వబోతోంది?
సందీప్ నియామకం వెనుక హైకమాండ్ అసలు ప్లాన్ ఏంటన్నది బయటకు రాలేదు. కానీ వరుసగా ఇన్‌ఛార్జ్‌ల మార్పులు, ఇటీవల బయటపడిన అంతర్గత విభేదాలు చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్‌లో లీడర్ల మధ్య కోఆర్డినేషన్ ఎంత అవసరమో అర్థమవుతోంది. ఇప్పుడు సందీప్ ముందు రెండు కీలక ప్రశ్నలు ఉన్నాయి. ఆయన రాష్ట్ర నాయకత్వంతో కలిసి పని చేయగలరా? పార్టీ లీడర్ల మధ్య గొడవలను కంట్రోల్ చేయగలరా? ఈ ప్రశ్నలకు జవాబులు రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగే పరిణామాలే చెప్పాలి.


