Varanasi: వారణాసి సినిమా గురించి ఇప్పటి వరకూ చాలా విషయాలు బయటకి వచ్చాయి. వాటిలో కొన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళీనే హాలీవుడ్ పాడ్ కాస్ట్‌లలో రివీల్ చేశాడు. కానీ, ఇప్పటి వరకూ ఒక్క విషయం ఎక్కడా రివీల్ కాలేదు. అదే హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి. తాజా సమాచారం మేరకు వారణాసి సినిమలో శ్రుతి కీలక పాత్రను పోషించినట్టుగా తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాను శ్రీ దుర్గ ఆర్ట్స్, కార్తికేయ కలిసి దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా..పాన్ వరల్డ్ స్థాయిలో 120 దేశాలలో 50 భాషలలో రిలీజ్‌కి రంగం సిద్ధం అవుతోంది. ప్రస్తుతం, బ్యాలెన్స్ ఉన్న షూట్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్..బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి చేస్తున్నారు. జనవరి నెలాఖరు వరకూ దాదాపు అన్నీ పనులు ఓ కొలిక్కి తీసుకువచ్చి ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టనున్నారు.
అయితే, కుంభ పాత్రలో నటిస్తున్న మలయాళ నటుడు పృథ్వి రాజ్ సుకుమారన్ కి జంటగా శ్రుతి హాసన్ నటించినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా జక్కన్న సినిమాలో కొన్ని పాత్రల గురించి గానీ, కొన్ని కీలకమైన సన్నివేశాల గురించి గానీ అసలు రివీల్ చేయరు. అలా, రివీల్ చేయనివి సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. అలాగే, వారణాసి సినిమాలో శ్రుతి హాసన్ పాత్రను రాజమౌళి గోప్యంగా ఉంచినట్టు సమాచారం.
గ్లోబ్ ట్రాటర్ అంటూ నిర్వహించిన వారణాసి సినిమా ఈవెంట్‌లో సింగర్‌గా శ్రుతి హాసన్ సందడి చేశారు. ఈ సినిమాలో ఉన్న 'సంచారి' అనే పాటను శ్రుతి పాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, కేవలం పాట మాత్రమే పాడిందనుకున్నారు. కానీ, ఇప్పుడు అందుతున్న సమచారం మేరకు, విలన్‌గా నటిస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్‌కి భార్య పాత్రలో ఈ బ్యూటీ అలరించబోతుందని తెలుస్తోంది. దీనిపై, రాజమౌళి బృందం నుంచి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ మాత్రం లేదు. కానీ, ఈ వార్త వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో మాత్రం ఆరాటం ఎక్కువైంది. కాగా, గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్‌కి జంటగా నటించింది. 2027, ఏప్రిల్ 7న ప్రపంచ దేశాలలో రిలీజ్ కాబోతోంది.


