Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా 'ఓం'. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో నటించాడు. ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. అయితే, రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఇటీవలే ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూశాక ఆల్రెడీ అందరికీ తెలిసిన కథనే మళ్ళీ తమిళంలో చేస్తున్నారు..ఇది ఆడే సినిమా కాదంటూ ప్రచారం జరుగుతోంది.
తెలుగులో వచ్చిన పుష్ప, కింగ్డం:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంఛైజీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ రూపొందించిన ఈ సినిమా రెండు భాగాలు భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించాయి. అంతేకాదు, అల్లు అర్జున్‌కి ఐకాన్ స్టార్ అనే ఇమేజ్‌ను పాన్ ఇండియా వైడ్‌గా తెచ్చిపెట్టింది. ఎర్రచననం స్మగ్లింగ్ నేపథ్యంలో హీరో పాత్ర సాగుతుంది. రా అండ్ రస్ట్రిక్ కథా-కథనాలతో వచ్చిన ఈ సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను మించి వసూళ్లను రాబట్టింది.
ఇక, విజయ్ దేవరకొండ నటించిన డిజాస్టర్ మూవీ కింగ్‌డం కూడా ఇదే కథాంశంతో వచ్చింది. కానీ, ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. సరైన కథ-కథనాలు లేకపోవడం హీరోయిన్ పాత్రకి ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడం వంటి పలు అంశాలు కింగ్‌డం సినిమా ఫ్లాప్‌కి కారణమయ్యాయి. అయితే, ఇప్పుడు ధనుష్-మమ్ముట్టి నటించిన ఓ సినిమా కథ కూడా ఈ తరహా జానర్‌లోనే రూపొందించారని ఇటీవల వచ్చిన ట్రైలర్‌తో అర్థమైంది.
ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించిన సాయి పల్లవి ఆదేశాలతో ఎర్రచందనం స్మగ్లింగ్ డాన్ అయిన మమ్ముట్టి గ్యాంగ్‌లోకి కోవర్ట్‌గా వెళ్లిన ధనుష్.. పోలీసుల అకృత్యాలను చూసి చివరికి వారికే ఎదురుతిరగడం.. ఆ తర్వాత మమ్ముట్టితో చేతులు కలుపుతాడని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఈ కథాంశం అందరికీ తెలిసిందే. పైగా, కథా నేపథ్యం గురించి ట్రైలర్‌లో మొత్తం రివీల్ చేయడం కూడా ఓ మైనస్ అంటున్నారు. మరి, ఎంతవరకు ఓం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా, ఈ సినిమాను ‘అమరన్’ వంటి భారీ మంచి కమర్షియల్ హిట్ తీసిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించాడు. సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు.


