సినిమా

Tollywood: కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరమే.. ఇప్పుడు చాలా బిజీ..

4 నిమిషాల పఠనం

Tollywood: ఒకప్పుడు మన టాలీవుడ్ యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం మంచి ఫాంలోనే కొనసాగాడు. మరి, బ్లాక్ బస్టర్స్ అందుకోలేకపోయినా, కొన్ని సినిమాలు హీరోగా మంచి గుర్తింపును తెచ్చాయి. కానీ, ఇండస్ట్రీలో స్టార్స్ తనకి సపోర్ట్ చేయడం లేదని, తన సినిమాలపై నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నారని బాగా ఫీలైయ్యాడు..ఈవెంట్‌లో ఎమోషల్ అయ్యాడు కూడా. అలా, బాధపడిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు చాలా బిజీగా మారిపోయాడు.

కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. హీరోగా మాత్రమే సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు నటుడిగా, నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా తన సత్తా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ యంగ్ హీరో కెరీర్‌లో 'కె ర్యాంప్', 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇలా, వరుస విజయాలతో తన మార్కెట్‌ను కూడా బాగా పెంచుకున్న కిరణ్.. ఆ ట్రాక్ తప్పకుండా కథల ఎంపికలోనూ కొత్తదనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు.

కేవలం హీరోగా సినిమాలు చేయడమే కాకుండా, మెగా ఫోన్ పట్టుకొని తెరవెనుక కూడా తన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం బాగా ఆసక్తి చూపిస్తున్న సినిమాల్లో 'రియాలిటీ' ఒకటి. ఈ సినిమాతో దర్శకుడిగా కూడా కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకి కథ, దర్శకత్వ బాధ్యతలతో పాటు హీరోగానూ కనిపించబోతున్నాడు. అలాగే, 'ఇంద్రపుత్ర' సినిమాతో మైథలాజికల్ యాక్షన్ ఫాంటసీ జానర్‌లోకి కూడా ఎంటరవుతున్నాడు కిరణ్.

శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కిరణ్ కెరీర్‌లో మరో కొత్త ప్రయత్నం అని చెప్పాలి. ఇవే, కాదు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గువ్వల చెరువు ఘాట్' అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ రంగంలోకి కూడా దిగుతున్నాడు. మొత్తం 8 ఎపిసోడ్లతో పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఇందులో కిరణ్ అబ్బవరం జర్నలిస్ట్గా కనిపించనున్నాడు. మరోవైపు నిర్మాతగానూ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. మొత్తానికి, ఒకదశలో కిరణ్ అబ్బవరం సినిమాలను అంతగా పట్టించుకోని వాళ్ళు కూడా, ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.

#Kiran Abbavaram#Tollywood#Latest Cinema News#Actor Kiran Abbavaram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి