ఏపీ

chandini chowdary : ప్రశ్నిస్తే బ్లేమ్ చేస్తేస్తారా? అభిప్రాయం చెప్పే హక్కులేదా? : నటి చాందిని

4 నిమిషాల పఠనం

ఏపీలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై ప్రశ్నించిన సినిమా యాక్టర్ చాందిని చౌదరిపై ట్రోల్స్ మొదలవ్వడంపై ఆమె మరోసారి స్పందించారు. ‘ప్రశ్నిస్తే బ్లేమ్ చేస్తారా..? అభిప్రాయం చెప్పే హక్కు లేదా?’ అంటూ ఫైర్ అయ్యారు. గత కొంతకాలంగా విశాఖలో కొండల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

ఏపీలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై ప్రశ్నించిన సినిమా యాక్టర్ చాందిని చౌదరిపై ట్రోల్స్ మొదలవ్వడంపై ఆమె మరోసారి స్పందించారు. ‘ప్రశ్నిస్తే బ్లేమ్ చేస్తారా..? అభిప్రాయం చెప్పే హక్కు లేదా?’ అంటూ ఫైర్ అయ్యారు. గత కొంతకాలంగా విశాఖలో కొండల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఆమె ప్రకృతిని నాశనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘కొండల్ని ధ్వంసం చేస్తుంటే గుండె తరుక్కుపోతోంది’అంటూ ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా హీరోయిన్ చాందిని చౌదరీ పోస్టు పెట్టారు.అభివృద్ధి, అర్బనైజేషన్ పేరిట విశాఖపట్నం పరిసరాల్లోని కొండల్ని ఏపీలోని కూటమి సర్కార్ ధ్వంసం చేస్తున్నదని పరోక్షంగా స్పందించారు. ఈ దృశ్యాలు చూస్తుంటే గుండె బరువెక్కుతోందని, ప్రకృతి అందాలు నాశనమవుతుంటే తన మనసు కలత చెందుతోందంటూ చాందిని చౌదరీ వాపోయారు.

ఈ క్రమంలోనే ఆమెను కూటమి నేతలు టార్గెట్ చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఆర్కే బీచ్ తీరంలో కొండలను తొలచి బంగ్లాలు కట్టినప్పుడు ఎందుకు స్పందించలేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా, వైసీపీ మద్దతుగా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఎంత తీసుకున్నామ్ అనే రేంజులో కొందరు కామెంట్స్ చేసినట్టు సమాచారం.

తనపై జరుగుతున్న ట్రోల్స్ మీద చాందిని చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అభిప్రాయాన్ని వెల్లడించినందుకు జరుగుతున్న విమర్శల దాడిపై మరో వీడియో విడుదల చేశారు. ‘మనకు బాధ కలిగినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయాలు చెప్పే హక్కు మనకు ఉంది.వాళ్లకు అనుకూలంగా లేదని బ్లేమ్ చేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, చాందిని చౌదరిని పలువురు అభినందిస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు నిర్మోహమాటంగా తన అభిప్రాయం వెల్లడించడం తప్పుకాదని, ట్రోల్ చేసేవారు ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలని హితవు పలికారు.

#chandini chowdary#cinema actor#environment damage#andrapradesh#digging mountains#vizag#tdp#jansena#bjp#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి