Tollywood: జనవరి మొదటివారంలో విశ్వంభర రిలీజ్..ఇది కూడా రూమరా? అవును..దాదాపు ఏడాదికి పైగా వాయిదాల పర్వం నడుస్తోంది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వివంభర సినిమా. త్రిష కృష్ణన్ హీరోయిన్గా ఆషిక రంగనాథ్ కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే, వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల బాగా ఆలస్యం అవుతూ వస్తోంది. అసలు, ఈ సినిమా విడుదల కాకుండా పక్కన పెట్టారనే రూమర్స్ నుంచి మళ్ళీ ఊపందుకుంది.
ఇటీవలే, విశ్వంభర సినిమాకి డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయింది. అంటే, లోలోపల సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోందని క్లారిటీ వచ్చింది. దీంతో, ఈ సినిమాకి సంబందించి రక రకాల వార్తలు వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న విశ్వంభర సినిమాను యూవీ క్రియోషన్స్ భారీ బడ్క్జెట్తో నిర్మిస్తోంది.
జనవరి 9న రిలీజ్..ఇందులో నిజమెంత!
ఫిలింనగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 2027 జనవరి 9న 'విశ్వంభర'ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో తాజాగా, ఈ సినిమాకు సంబంధించి మరో ప్రమోషనల్ వీడియోను గానీ ట్రైలర్ ను గానీ విడుదల చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లుతెలుస్తోంది. అయితే, జనవరి మొదటివారంలో అన్నదానిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
కాకా కంటే ముందే విశ్వంభర రిలీజ్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా సినిమాను 2027, సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. దీనికోసం జనవరి 13న రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. అయితే, దీనికంటే వారం ముందే విశ్వంభర చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ, ఆ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా అన్నది సందేహమే. ప్రాపర్ ప్రమోషన్స్ లేకుండా సంక్రాంతి బరిలో విశ్వంభర లాంటి సినిమాను దింపితే సరైన ఫలితం అందుకోవడం అసాధ్యం. మరి, మేకర్స్ ప్లాన్ ఏంటో చూడాలి.


