వివాహేతర సంబంధాల మత్తులో పడి కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజా ఉదంతం ఇందుకు అద్దం పడుతోంది. ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఇద్దరు గొడవ పడ్డారు. మహిళ సేఫ్‌గానే ఉండగా.. ఒకరిపైమరొకరు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరు హత్యకు గురవ్వగా.. బాధితుడి బంధువులు హత్యకు పాల్పడిన వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టారు.
ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే.. జింకలగూడెంకు చెందిన మౌలానా(42), ఇస్మాయిల్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళతో ఎఫైర్ పెట్టుకున్నారు.ఈ విషయంలోనే ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగినట్టు సమాచారం. ఆ మహిళకు దూరంగా ఉండాలని ఒకరినొకరు హెచ్చరికలు చేసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే మౌలానాపై పగ పెంచుకున్న ఇస్మాయిల్..
అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ముందస్తు ప్లాన్ వేసి మౌలానా కదలికలపై నిఘా పెట్టాడు. అతను బయటకు వెళ్తున్న సమయంలో కారుతో వేగంగా ఢీకొట్టి అంతమొందించాడు. రోడ్డు ప్రమాదంలో మౌలానా మరణించాడని అందరూ భావించగా.. పోలీసుల విచారణలో ఇస్మాయిల్ పన్నాగం పన్ని హత్య చేశాడని ఆలస్యంగా వెలుగుచూసింది.
విషయం తెలిసి ఆగ్రహంతో ఊగిపోయిన మౌలానా బంధువులు.. ఇస్మాయిల్ ఇంటికి నిప్పంటించారు. ఆ సమయంలో ఇస్మాయిల్ కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలిసింది.వారు భయంతో బయటకు పారిపోగా.. నిప్పు అంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మౌలానా కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, మృతుడు మౌలానాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.
https://x.com/pulsenewsbreak/status/2093945623925907966?s=20












