Ananthika Sanilkumar: అనంతిక సనిల్ కుమార్..ఇప్పుడు ఈ పేరు ఫిల్మ్ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె నటించిన లేటెస్ట్ సినిమా రోమాంచికం విడుదలకి సిద్ధమయి జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తుండటమే. అయితే, ఆమె వయసుకి తగ్గ పాత్ర కాకపోవడంతో నాని నటిస్తున్న పాన్ ఇండియా సినిమాను వదులుకుందట. ఆ సినిమానే ది ప్యారడైజ్.
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సమర్పణలో ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి నిర్మాతగా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది రోమాంచికం. ఈ సినిమాను సెప్టెంబర్ 3న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అనంతిక సనిల్ కుమార్ పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.
"ది ప్యారడైజ్" సినిమా ఛాన్స్ అలా మిస్సైంది!
శ్రీకాంత్ ఓదెల, నాని కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్. సెప్టెంబర్ 24న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింది. అయితే, వాస్తవానికి ముందు ఈ పాత్ర కోసం అనంతిక సనిల్ ని పరిశీలించారట. ఫొటో షూట్ కూడా నిర్వహించారు. కానీ, నాని సరసన ఆమె చాలా చిన్న అమ్మాయిగా కనిపించడంతో ఆ ఛాన్స్ కయాదు లోహర్ కి దక్కింది. ఈ విషయాన్ని తాజాగా అనంతిక వెల్లడించింది.
"ఎల్లమ్మ" సినిమాలో ఛాన్స్?
ఇక, గత మూడు నాలుగు రోజుల నుంచి అనంతిక సనిల్ కి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో గ్రామ దేవత..కుల దైవం కోసం ఓ కుటుంబం ఎలాంటి సమస్యలను ఎదుర్కుంది అనే కథాంశంతో ఎల్లమ్మ తెరకెక్కుతోంది. ఇందులో, హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంది. ఇంతకముందు ఈ పాత్రకోసం సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లను పరిశీలించారు. కానీ, ఇప్పుడు వార్తల్లోకి అనంతిక పేరు వచ్చింది. మరి, దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.












