సినిమా

Toxic-Yash: Day 1 కలెక్షన్స్ 150 కోట్లు..ఇది కేవలం యష్ సత్తా మాత్రమే

రచన: Anshu4 నిమిషాల పఠనం

Toxic-Yash: యష్..కన్నడ సినిమా ఇండస్ట్రీ సత్తాను కేజీఎఫ్ సిరీస్‌తో చూపించాడు ప్రపంచానికి. ఎప్పుడూ కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి ఓ మాట వినిపించేది. ఇది చాలా చిన్న చిత్ర పరిశ్రమ. ఇక్కడ తక్కువ బడ్జెట్ సినిమాలే నిర్మిస్తారు. భారీ బడ్జెట్ సినిమా అంటే ఇక్కడ 5 నుంచి 10 కోట్ల లోపే ఉంటుంది. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడైనా, 10 కోట్లకి మించి సినిమా తీయలేము అని.

వీటన్నిటినీ యష్ - ప్రశాంత్ నీల్ కలిసి బద్దలు కొట్టారు. అంతకముందు ఉగ్రం సినిమా తీసిన ప్రశాంత్ నీల్..ఆ తర్వాత కేజీఎఫ్ 2 రెండు భాగాలతో ఒక్కసారిగా తెలుగులో బాహుబలి సిరీస్‌కి వచ్చినంత క్రేజ్‌ను కేజీఎఫ్ రెండు భాగాలతో తెచ్చిపెట్టారు. అప్పటి నుంచి కన్నడ సినిమాలపై ప్రతీ ఒక్కరికీ ఆసక్తి కలగడమే కాదు, అక్కడ స్టార్ హీరోలైన రిషబ్ శెట్టి, యష్‌లను బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలలోనూ తీసుకుంటున్నారు.

ఇక, నాలుగేళ్ల నుంచి కష్టపడి తీసిన సినిమా టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. వెంకట్ కె నారాయణతో కలిసి యష్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇన్ని ఏళ్ల నుంచి తీసిన సినిమా, పలుమార్లు వాయిదా పడటంతో కొంత నెగిటివిటీ పెరిగింది. కానీ, ప్రమోషనల్ కంటెంట్‌తో అందరిలోనూ విపరీతమైన అంచనాలను పెంచారు.

ఇక, టాక్సిక్ సినిమాను ఆగస్టు 26న పాన్ ఇండియా రేంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. మొదటి షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. దాంతో, నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్‌కి భారీ నష్టాలని ప్రచారం మొదలైంది. వాటిన్నిటికీ ధీటుగా డే 1 కలెక్షన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. మొదటి రోజు టాక్సిక్ కలెక్షన్స్ 150 కోట్లని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

#Toxic#Yash#GeethuMohanDas#Venkat K.Narayana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి