సినిమా

Rajinikanth vs Vijay Devarakonda: జైలర్ 2తో రణబాలి పోటీ..తేడా కొడితే?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Rajinikanth vs Vijay Devarakonda: రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌..ఆయన భార్య ర‌ష్మిక మందన జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ర‌ణ‌బాలి'. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ సినిమాలో సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ విలన్ గా కనిపించబోతున్నాడు.

Rajinikanth vs Vijay Devarakonda: రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌..ఆయన భార్య ర‌ష్మిక మందన జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ర‌ణ‌బాలి'. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ సినిమాలో సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే నిన్నా మొన్నటి వరకూ విడుదల తేదీపై క్లారిటీ రాకపోవడంతో సినిమా ఈ ఏడాది రాదనుకున్నారు. కానీ, తాజాగా చిత్ర బృందం తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ ని వదిలారు.

అయితే, వచ్చిన సమస్యల్లా ఇక్కడే. ఒక్కరోజు తేడాతో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా వస్తోంది. 'ర‌ణ‌బాలి' చిత్రాన్ని అక్టోబరు 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనునట్లు ప్రకటించారు. అంతేకాదు, పోస్టర్ తో పాటు 'మన చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో మొదలవుతుంది'.. అంటూ ఆసక్తికరమైన లైన్ ని రాశారు. ఇక, ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టుగా కూడా వెల్లడించారు.

మనకి దసరా సీజన్ బాగా కలిసి వస్తుంది. కాబట్టి, 'ర‌ణ‌బాలి' కి సోలో డేట్ దొరికిందని అనుకున్నారు. అయితే, సోలో రిలీజ్ దొరికే అవకాశం లేదని చాలామందికి తెలియదు. ఇప్పటికే, బాక్సాఫీస్ బరిలో సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 మూవీతో పోటీ పడుతున్నాడు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, అక్టోబర్ 15న విడుదలవుతోంది. అంతేకాదు, ధనుష్ నటిస్తున్న 'ఓం' సినిమాను అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు ఇంతకముందే ప్రకటించారు. కానీ, వాయిదా పడుతుందని తెలుస్తోంది.

ఒకవైపు ధనుష్ సినిమా, మరోవైపు చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర దసరా బరిలో లేవని విజయ్ సినిమాను ఫిక్స్ చేశారు. కానీ, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో విజయ్ దేవరకొండకి పోటీ తప్పడం లేదు. రజినీ వరుస హిట్స్‌తో భారీ వసూళ్లను రాబడుతున్నాడు. కానీ, విజయ్ కి మాత్రం గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో ఉన్నాడు. మరి, వీరిద్దరూ పోటీ పడితే ఆ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.

#rajinikanth#jailer 2#vijay devarakonda#ranabaali
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి