సినిమా

Chiranjeevi: "ఇరుముడి"పై మెగా ట్వీట్.. "మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి"!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇరుముడి సినిమా చూసిన తర్వాత ఆయన ఎక్స్ ద్వారా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ని మెగా అభిమానులు కూడా వైరల్ చేస్తున్నారు. ఇండస్ట్రీ గురించి..ఇక్కడ కొందరు చాటుగా చేస్తున్న రాజకీయాల గురించి చిరు ఇచ్చిన పంచ్ తగలాల్సిన వాళ్ళకి గట్టిగా తగిలిందంటున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు పెద్ద దిక్కు అనేదానికి ఆయనే కనిపించేవారు. దాసరి నారాయణ రావు తర్వాత మెగాస్టార్ వద్దకే ఎవరికి ఏ సమస్య వచ్చినా వెళ్ళేవారు. ఆయన ఒక మాట చెప్పారంటే ఆ సమస్య అక్కడితో పరిష్కారం కావాల్సిందే. కానీ, మధ్యలో కొందరు చేసిన కామెంట్స్, వ్యాఖ్యల వల్ల నన్ను ఇండస్ట్రీ పెద్ద అని మాత్రం అనవద్దు. కానీ, అందరికీ అండగా ఉంటాను..నేను అందరి వాడిని అని చెప్పారు.

చెప్పినట్టుగానే ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చి ఘన విజయం సాధించినా వారిని ఇంటికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఎవరు ఈవెంట్‌కి పిలిచినా వెళ్ళి ఆశీర్వదిస్తున్నారు. అది మెగాస్టార్. అయితే, పెద్ది సినిమా రిలీజ్ సమయంలో డిస్ట్రిబ్యూషన్ పరంగా దిల్ రాజు సోదరుడు చేసిన వ్యవహారం అందరినీ షాక్ కి గురి చేసింది. అంతకముందు పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా సమయంలోనూ అంతే.

దీంతో, చిరు కలగజేసుకోక తప్పలేదు. ఇక, ఇప్పుడు మైత్రీ వారు నిర్మించిన ఇరుముడి సినిమా భారీ విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో సినిమా చూసిన చిరు.."ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి"! అని రాసుకొచ్చారు. ఇక, త్రినాథ్ పాత్రలో రవితేజ అద్భుతంగా నటించాడు, బేబీ నక్షత్ర, ప్రియ భవానీ శంకర్, సాయి కుమార్ మంచి నటనను కనబరిచారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అద్భుతంగా ఉంది..అని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇప్పుడు, ఈ పోట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

#irumudi#chiranjeevi#raviteja#mythri movie makers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి