వైరల్ న్యూస్

TG : స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు

రచన: Kumar4 నిమిషాల పఠనం

చిన్నచిన్న విషయాలకే కొందరు వ్యక్తులు నడిరోడ్డు మీద సీన్ చేయడం, తోటి వారిని ఇబ్బందులకు గురిచేయడం చేస్తుంటారు. ట్రాఫిక్ ఆగిపోయేలా చేసి నానా రచ్చ చేస్తుంటారు.వీరి చర్యల కారణంగా ప్రయాణికులు, పోలీసులు, మహిళలు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

చిన్నచిన్న విషయాలకే కొందరు వ్యక్తులు నడిరోడ్డు మీద సీన్ చేయడం, తోటి వారిని ఇబ్బందులకు గురిచేయడం చేస్తుంటారు. ట్రాఫిక్ ఆగిపోయేలా చేసి నానా రచ్చ చేస్తుంటారు.వీరి చర్యల కారణంగా ప్రయాణికులు, పోలీసులు, మహిళలు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఎక్కడో చోట దర్శనమిస్తూనే ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏ ఘటన జరిగినా ఇట్టే తెలిసిపోతోంది.

తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. స్వీట్ షాపులో చిన్న వివాదం కాస్త చిలికిచిలికి గాలి వానలా మారింది.కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు.. ఓ స్వీటు కొనుగోలు చేశాడు. అయితే, ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడని రాజు యజమానిని నిలదీశాడు.

ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురైన కస్టమర్ షట్టర్ కిందికి వేసేందుకు యత్నించాడు.దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న నలుగురు పోలీసులు రాజుపై విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్‌స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అయితే, కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగిన రాజు.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు.

https://x.com/TeluguScribe/status/2092865900235866120?s=20

అయితే, చిన్న గొడవకు పోలీసులు ఇలా చేయడం సరికాదని, మందలించి వదిలేయాల్సిందని కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.అక్కడ జరిగిందని క్రైమ్ కాదని, కేవలం వాగ్వాదం అని..దానికే ఇలా నడిరోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకెళ్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో బాధితుడికి ఉన్నతాధికారులు న్యాయం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

#sweet#price#police#beaten#jammikunta#karimnagar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి