సినిమా

Tollywood: అనుపమ పరమేశ్వరన్ పెళ్ళైపోయిందా!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Tollywood: మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి పెళ్ళైందా..తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ చూస్తే అదే అనిపిస్తోంది. ఆమె ఇంతకముందు ఒక హీరోతో ప్రేమలో ఉండి..పెళ్ళి చేసుకోవాలనుకొని కూడా ఇద్దరి మధ్య సఖ్యత కుదరక విడిపోయారు. ఆ తర్వాత సినిమాల మీదే అనుపమ పరమేశ్వరన్ పూర్తిగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్ళికి సంబందించిన ఫొటోస్ వైరల్ అవుతుండటంతో ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అవుతోంది.

ప్రేమం మూవీతో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత తెలుగులో అ..ఆ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపు ఆమెకి పలు విజయవంతమైన చిత్రాలలో నటించే అవకాశాలను తెచ్చిపెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. శతమానంభవతి, హలోగురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ లాంటి చిత్రాల్లో నటించి క్రేజీ హీరోయిన్‌గా మారింది. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ..18 పేజెస్, కార్తికేయ 2 చిత్రాలతో మళ్ళీ ఫాంలోకి వచ్చింది.

ఇక ఈ బ్యూటీ, గత కొంతకాలంగా లవ్ లో ఉండి.. ఇటీవల తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్ తో నిత్యం వార్తల్లో నిలిచింది. ధ్రువ్ ప్రవర్తన ఎంతో అరాచకంగా ఉండేదని, చివరికి తన సొంత తమ్ముడిని ముట్టుకోవాలన్నా కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని అనుపమ చేప్పడంతో సినిమా ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే అయింది. ఎట్టకేలకి ఆ బాధల నుంచి బయటపడ్డ అనుపమ పరమేశ్వరన్..మళ్ళీ సినిమా ప్రయత్నాలలో బిజీ అయింది. వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది.

ఇలాంటి సమయంలో తాజాగా ఆమె పెళ్ళి చేసుకుందని వార్తలు ఊపందుకున్నాయి. కానీ, దీని వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయని తేలిపోయింది. ఓ కమర్షియల్ యాడ్ ఫిల్మ్ కోసమే అనుపమ పరమేశ్వరన్ అలా పెళ్ళి వస్త్రాల్లో కనిపించింది. ఆ సమయంలో తీసిన ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాలతో పాటు పలు యాడ్ ఫిల్స్మ్ కూడా అనుపమ పరమేశ్వరన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ఓ కొత్త యాడ్ ఫిల్మ్ కి సంబందించినవే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న అనుపమ పరమేశ్వరన్ పెళ్ళి ఫొటోలు.

#anupama parameswaran#tollywood#south actress anupama parameswaran
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి