సినిమా

Mythri-Movie-Makers: మైత్రీ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Mythri-Movie-Makers: ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. నిర్మాణంలో కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ మైత్రీ దూసుకుపోతోంది. ఇటీవల ఈ సంస్థ నుంచి వచ్చిన ఇరుముడి సినిమా 230 కోట్లకి పైగా వసూళ్ళను రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా నిలిచింది. తాజాగా, ఇదే సంస్థ నుంచి ధృవ్ విక్రమ్ హీరోగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది.

తెలుగులో ఉన్న మైత్రీ వారు మన తెలుగు స్టార్ హీరోలతో ఇప్పటికే, పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను చేస్తున్నారు. మిడ్ రేంజ్ హీరో దగ్గర్నుంచి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో వరకూ దాదాపు అందరితోనూ సినిమాలను చేస్తున్నారు. అయితే, మైత్రీ వారు తమ నిర్మాణ సంస్థను ఒక్క టాలీవుడ్ కి మాత్రమే పరిమితం చేయడం లేదు. ఇతర భాషలలోనూ సినిమాలు చేయడానికి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే, బాలీవుడ్..కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్స్‌తో ప్రాక్జెక్ట్స్ కమిటైయ్యారు.

ఇక, తాజాగా కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ తో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా రూపొందనుంది. అంతేకాదు, తాజాగా టైటిల్ తో పాటు ధృవ్ విక్రమ్ లుక్ ని కూడా వదిలారు. మైత్రీ వారి నిర్మాణంలో ధృవ్ విక్రమ్ హీరోగా జాకీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కబోతోంది.

ఇక తాజాగా వదిలిన పోస్టర్ చూస్తుంటే..ఈ చిత్రాన్ని దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నటుగా అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు మైత్రీ వారు. ప్రస్తుతం, ఈ సంస్థ నుంచి ప్రశాంత్ నీల్-ఎన్‌టిర్ సినిమా, విజయ్ దేవరకొండ రణబాలి, జై హనుమాన్, ఆర్సీ 17 సహా మరికొన్ని భారీ చిత్రాలున్నాయి.

#Mythri-Movie-Makers#Dhruv Vikram#Tollywood#Kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి