సినిమా

#AA24: అల్లు అర్జున్ 24..కన్‌ఫ్యూజన్‌లో ఉన్న ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

#AA24: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌..ప్రస్తుతం పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ వద్ద తనకంటూ ఓ ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. పుష్ప సిరీస్‌తో గ్లోబల్ రేంజ్‌లో బన్నీ మార్కెట్ ఏ రేంజ్‌లో పెరిగిందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టే తన కొత్త ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి. ప్రస్తుతం, అల్లు అర్జున్ అట్లీతో చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ లోపే తన 24వ సినిమా లీక్ బయటకి వచ్చింది. మలయాళ దర్శకుడు బాసిల్‌ జోసెఫ్‌ తో బన్నీ 24వ సినిమా ఉండబోతోంది.

అల్లు అర్జున్ వరుసగా అన్నీ భారీ ప్రాజెక్టులతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే, అట్లీతో చేస్తున్న సినిమా ముంబైలో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీకరణ నాన్ స్టాప్‌గా జరుగుతోంది. దీపిక పడుకొణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ దాదాపు 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఇక, ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో భారీ యాక్షన్ సినిమాను చెయబోతున్నాడు. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో రూపొందనున్న 23వ సినిమా. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రాబోతోంది. త్వరలో, ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. అయితే, తాజాగా అల్లు అర్జున్ నటించబోతున్న తన మైల్‌స్టోన్‌ మూవీ 24 నుంచి లీక్స్ వచ్చాయి.

ఇన్నాళ్ళు, బన్నీ తన 24వ సినిమా కోసం ఏ జోనర్‌ను ఎంచుకోబోతున్నాడు? ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుడు ఎవరు? అనే ప్రశ్నలు గత కొంతకాలంగా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఓ ఫొటో ఈ అనుమానాలను దాదాపు నిజం చేస్తూ చాలా వరకూ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో సూపర్‌ హీరో కథతో ఇండియన్‌ సినిమా దృష్టిని తనవైపు తిప్పుకున్న డైరక్టర్ బాసిల్‌ జోసెఫ్‌. ఆయన దర్శకత్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. గీతా ఆర్ట్స్ సంస్థలో కో రైటర్ అరుణ్‌ అనిరుధన్‌ తో కలిసి బాసిల్‌ జోసెఫ్‌ సరికొత్త కథను సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం, ఈ పిక్‌తో ప్రాజెక్ట్‌కి కన్‌ఫర్మేషన్ రావడమే కాదు..ప్రాజెక్ట్ లాకైందని తెలిసింది.

##aa24#allu arjun#basil joseph#geetha arts
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి