Aishwarya Lekshmi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఫౌజీ, తో పాటు భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’ కూడా ఉంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ పోలీస్ యాక్షన్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. గత నెల మొత్తం ఫౌజీ సినిమా కోసం డేట్స్ ఇచ్చిన ప్రభాస్..ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం పూర్తిగా సమయం కేటాయిస్తున్నాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కూడా నటించబోతోందట.
ఇందులో ఆమెదొక అతిథి పాత్ర అని తెలుస్తోంది. దర్శకుడు సందీప్.. ఐశ్వర్య లక్ష్మిని ఓ పోలీస్ పాత్రలో చూపించబోతున్నాడని తెలుస్తోంది. సందీప్ సినిమాలలో గెస్ట్ రోల్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మంచి పేరొస్తుంది కూడా. అనిమల్ సినిమాలో ఇలాంటి ఓ అతిథి పాత్ర చేసిన త్రిప్తి ఇప్పుడు ఏకంగా స్పిరిటి మూవీలో హీరోయిన్‌గా ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసింది.
త్రిప్తి పాత్ర అనిమల్ సినిమాలో చాలా ఎమోషనల్ గా సాగుతుంది. ఒక సాంగ్, కొన్ని సీన్స్ అయినప్పటికి కూడా బాగా పాపులర్ అయింది. అలాంటి పాత్రనే స్పిరిట్ లోనూ ఐశ్వర్య లక్ష్మి కోసం సందీప్ రాశాడట. ఇక, ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకూ ఏ దర్శకుడు ప్రభాస్ కోసం ఇలాంటి పవర్ ఫుల్ కాప్ స్టోరిని తీయలేదు. ఒకరకంగా ఇది పెద్ద ప్రయోగమే అనుకోవాలి.
ఇక స్పిరిట్ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ సాలీడ్ వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. టి-సిరీస్ అండ్ భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా, ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. అర్జున్ రెడ్డి, అనిమల్ చిత్రాల కంటే కూడా సందీప్ రెడ్డి వంగా ఈ మూవీతో మరో వినూత్నమైన సినిమాను తీసుకు రాబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో స్పిరిట్ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.












