తెలంగాణ

Congress : రేవంత్‌కు అందరికంటే ముందు సపోర్టు ఇచ్చిందే నేనే.. కానీ! :కొండా సురేఖ

రచన: Kumar4 నిమిషాల పఠనం

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులు, పదవులు, తెరచాటు రాజకీయాలపై మాజీమంత్రి కొండా సురేఖ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘పదవులు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. ప్రజల్లో ఉండేవాళ్లే అసలైన నాయకులు’ అని కొండా సురేఖ అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులు, పదవులు, తెరచాటు రాజకీయాలపై మాజీమంత్రి కొండా సురేఖ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘పదవులు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. ప్రజల్లో ఉండేవాళ్లే అసలైన నాయకులు’ అని కొండా సురేఖ అన్నారు. ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన కార్యకర్తలు, ముఖ్యనేతల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాను ఎంపీటీసీ నుంచి మంత్రి స్థాయికి ఎదిగానని చెప్పుకొచ్చారు.

కష్టకాలంలో కార్యకర్తలంతా తన వెన్నంటే నిలిచారని చెప్పారు. గతంలో ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ బంధం అలాగే కొనసాగేదని.. ఇప్పుడు అవకాశవాద రాజకీయం పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ‘కొండా’ ఫ్యామిలీకి గుర్తింపు ఉందని చెప్పారు. వైఎస్ జగన్ కోసం నాడు క్షణం ఆలోచించకుండా మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు తమను కంటికిరెప్పలా కాపాడారని కీలక వ్యాఖ్యలు చేశారు.

తనపై ఢిల్లీకి ఫిర్యాదులు ఇచ్చేవాళ్లు ఉన్నారని ఆనాడే వైఎస్ అనేవారని, ఆయన చనిపోయాక పార్టీలోని కొందరు తమను టార్గెట్ చేశారని చెప్పారు. ఉమ్మడి ఏపీ విడిపోయాక... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాడు ఉద్యమనేత కేసీఆర్ తమను పిలిచి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. వరంగల్ ఈస్ట్‌లో పరిస్థితులను కొండా కుటుంబం అయితేనే సెట్ చేయగలదని ఆయన చెప్పినట్టు వెల్లడించారు. కానీ, పరకాల నియోజకవర్గాన్ని వదిలి వెళ్లడం తమదే పొరపాటు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక 2023లో రేవంత్ అన్న రైతుల కోసం పాదయాత్ర ప్రారంభిస్తే మొదట సపోర్టు ఇచ్చింది తానేనని కొండా సురేఖ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ లాంటి మాస్ లీడర్ కావాలని కోరుకున్నది తానేనని వివరించారు.కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని.. తన మీద కొందరు కావాలనే కుట్రలు చేశారన్నారు. ఇదిలాఉండగా, మంత్రి నుంచి కొండాను తప్పించాక ఆమె పార్టీకి అంటిముట్టనట్టు వ్యహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు అధిష్టానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం.కొండా సురేఖకు కీలక పదవి దక్కనుందని, అందుకే ఢిల్లీ నుంచి పిలుపువచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

#konda sureka#congress#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి