తెలంగాణ

కోమట్ల వద్ద కోడిగుడ్డంత బంగారమైనా ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య సమాజం ప్రాముఖ్యత, వారి ఆర్థిక వ్యూహాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యాపార దార్శనికత కలిగిన ఆర్యవైశ్యులు వందల, వేల సంవత్సరాల కిందే బంగారం ధరలు పెరుగుతాయని ముందే ఊహించారని కొనియాడారు.

 హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య సమాజం ప్రాముఖ్యత, వారి ఆర్థిక వ్యూహాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యాపార దార్శనికత కలిగిన ఆర్యవైశ్యులు వందల, వేల సంవత్సరాల కిందే బంగారం ధరలు పెరుగుతాయని ముందే ఊహించారని కొనియాడారు. ఎంతటి పేద కోమటి ఇంట్లో చూసినా కనీసం కోడిగుడ్డంత బంగారమైనా ఉంటుందని, ఆర్థిక నిల్వలు, పొదుపు సూత్రాలను ప్రపంచానికి నేర్పిన ఘనత ఈ వర్గానిదేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 అనంతరం ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందంటే దానికి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షే ప్రధాన కారణమని కొనియాడారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన రోశయ్య ఆర్థిక మేధస్సును ప్రశంసిస్తూ, తెలంగాణ నేడు ధనిక రాష్ట్రంగా నిలదొక్కుకుందంటే ఆనాడు రోశయ్య ప్రవేశపెట్టిన క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాలే కారణమని తెలిపారు.

 అయితే, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తీరు, ఆయన వైఖరిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు, తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొట్టి శ్రీరాములు అమరణ పోరాటం వల్ల ఏర్పడిందని ఒప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం విషయంలో మాత్రం ప్రజల సుదీర్ఘ పోరాటాన్ని, అమరుల త్యాగాలను పక్కనపెట్టి 'సోనియా గాంధీనే ఇచ్చారు' అని ప్రచారం చేయడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నిస్తున్నారు.

 సభలు, సందర్భాలను బట్టి రేవంత్ రెడ్డి తన మాట తీరును, వ్యాఖ్యానాలను మారుస్తున్నారని విపక్ష నేతలు ధ్వజమెత్తారు. ఆర్యవైశ్య భవనం వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, రాష్ట్రాల ఏర్పాటు, రాజకీయ అంశాల్లో ఆయన ప్రదర్శించిన వైఖరిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి ప్రసంగంపై సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నాయి.

#RevanthReddy#AryaVysyaBhavan#PottiSreeramulu#Rosaiah#TelanganaPolitics#CongressvsBRS#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి