National

Madhya Pradesh: సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా!!.. అభిజీత్ దీప్కే సంచలన పోస్ట్..

రచన: Venu4 నిమిషాల పఠనం

చిన్నారుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ నేను మధ్యప్రదేశ్ సీఎంగా తక్షణమే రాజీనామా చేస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. గిరిజన బిడ్డల ప్రాణాలు పోతుంటే ఈ పదవిలో కొనసాగడానికి నా అంతరాత్మ అంగీకరించడం లేదు.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఎక్కువగా వినిపిస్తున్న పేరు అభిజీత్ దీప్కే. సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ వ్యవస్థాపకుడైన దీప్కే.. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో మరణించిన 30 మందికి పైగా గిరిజన చిన్నారుల కుటుంబాలకు మద్దతుగా నిలిచారు. క్షేత్రస్థాయిలో బాధితులను పరామర్శించి, వారి తరఫున గళమెత్తారు.. ఇక గత కొన్ని నెలలుగా వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై నేరుగా పోరాడటంతో దీప్కే పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.

మరోవైపు శనివారం బాధితులను పరామర్శించేందుకు బాలాఘాట్ వెళ్లిన దీప్కేకు అక్కడి అధికార పక్ష మద్దతుదారులు, కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, అవహేళనలు ఎదురయ్యాయి. ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తూ, ఆయన పర్యటనను హాస్యాస్పదం చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ అవమానాలకు ఏమాత్రం కుంగిపోని అభిజీత్ దీప్కే, వాటిని తిప్పికొట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ, వినూత్న రీతిలో వ్యంగ్యాస్త్రాలు విసిరి అధికార యంత్రాంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు.

తను నేరుగా ముఖ్యమంత్రినే అయినట్లు కొందరు విమర్శించడంతో, దీప్కే సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ పెట్టారు. చిన్నారుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ నేను మధ్యప్రదేశ్ సీఎంగా తక్షణమే రాజీనామా చేస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. గిరిజన బిడ్డల ప్రాణాలు పోతుంటే ఈ పదవిలో కొనసాగడానికి నా అంతరాత్మ అంగీకరించడం లేదు. మొదట రెండు లక్షల పరిహారం అని, నిరసనలు వెల్లువెత్తాక నాలుగు లక్షలు చేస్తామని చెప్పాము. అదే చనిపోయింది ఏ ఎమ్మెల్యే పిల్లలో అయితే ఇంతే పరిహారంతో సరిపెట్టేవారిమా? అని ప్రశ్నించారు.

అలాగే, బాధ్యులైన వైద్యాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబడుతూ.. రాష్ట్రంలోని గిరిజనులందరికీ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం విమర్శలతో సరిపెట్టకుండా, ప్రభుత్వ కళ్లు తెరిపించేలా దీప్కే వేసిన ఈ వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

#Madhya Pradesh#Government#CM post#Abhijeet Dipke#Tribal Children#sensational post
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి