సినిమా

The Paradise: రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ చేసినా అనిరుధ్ పట్టించుకోడా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

The Paradise: నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమా విషయంలో ముందు నుంచి రక రకాల రూమర్స్ చుట్టు ముడుతూనే ఉన్నాయి. ప్రారంభంలో నాని మేకోవర్ చూసి..ఈ గెటప్ ఏంటి..ఆ జడలేంటీ..గ్లింప్స్ లో ఆ బూతులేంటీ..ఇదసలు నాని సినిమానా కాదా? అని మాట్లాడుకున్నారు. దీని, కారణం నాని గెటప్ అందరికీ నచ్చకపోవడమే. ఆ టాక్ నుంచి జనాలలో మంచి ఆసక్తిని రగిలించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.

The Paradise: నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమా విషయంలో ముందు నుంచి రక రకాల రూమర్స్ చుట్టు ముడుతూనే ఉన్నాయి. ప్రారంభంలో నాని మేకోవర్ చూసి..ఈ గెటప్ ఏంటి..ఆ జడలేంటీ..గ్లింప్స్ లో ఆ బూతులేంటీ..ఇదసలు నాని సినిమానా కాదా? అని మాట్లాడుకున్నారు. దీని, కారణం నాని గెటప్ అందరికీ నచ్చకపోవడమే. ఆ టాక్ నుంచి జనాలలో మంచి ఆసక్తిని రగిలించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.

ఇక, ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ కి రెడీ అవుతుంది. దీనిపై కూడా పలు రకాల రూమర్స్ వచ్చాయి. దీనికి, కూడా మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యారడైజ్ సినిమాను అనుకున్న తేదీనే పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తామని. ఎక్స్ ద్వారా డబుల్ కన్‌ఫర్మేషన్ వచ్చింది. దీన్ని బట్టి మరో 15రోజుల్లో నాని సినిమాను థియేటర్స్‌లో చూడబోతున్నాము. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.

అనిరుధ్ వల్ల ఆలస్యం అవుతుందా?

ప్యారడైజ్ సినిమాకి సంగీతం అందిస్తున్నది కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. తమిళంలో భారీ హిట్స్ ఇస్తున్నాడు గానీ, తెలుగులో మాత్రం ఇప్పటి వరకూ అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఏ సినిమా హిట్ కాలేదు. అయినా, మేకర్స్ అతనికి బాగానే అవకాశాలు ఇస్తున్నారు. ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ, ప్యారడైజ్ సినిమాకి ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి చేయలేదని తాజా వార్త సారాశం. ప్రస్తుతం, అనిరుధ్ విదేశాలలో మ్యూజిక్ కాన్సెర్ట్స్‌తో బిజీగా ఉన్నాడు.

ప్యారడైజ్ రిలీజ్‌కి ఇంకా రెండు వారాల సమయమే ఉంది. షూటింగ్ కూడా కొంత బ్యాలెన్స్ ఉందట. అలాగే, ఓ సాంగ్ షూట్ కూడా ఉందని అంటున్నారు. అంటే, అనుకున్న సమయానికి థియేటర్స్‌లోకి రావాలంటే మేకర్స్ ముందు పెద్ద ఛాలెంజే ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అనిరుధ్ ఎక్కడున్నా కంటెంట్ పంపితేగాని తన పని పూర్తి చేయని పరిస్థితి. ఇంకా, సాంగ్..టాకీ పార్ట్..బీజిఎం బ్యాలెన్స్ అంటే ఈ రెండు వారాల సమయం సరిపోతుందా? ప్రమోషన్స్ ఎప్పుడు చేస్తారు..బిజినెస్ పరిస్థితేంటీ? ఇలాంటివన్నీ ఫిల్మ్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చలు. దీనిపై, మేకర్ మరోసారి స్పందించాల్సి ఉంది.

#The Paradise#Nani#Srikanth Odela#Kayadu Lohar#Anirudh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి