ఏపీ

గిరిజనులు ఇచ్చిన చికెన్ అందుకే తినలేదు: పవన్ కల్యాణ్

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలవరం జిల్లాలో చేపట్టిన 'అడవితల్లి బాట 2.0' పర్యటన రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా గిరిజన ప్రాంతాలను సందర్శించిన ఆయన, అక్కడి స్థానిక గిరిజనులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సంప్రదాయ పద్ధతిలో ఎంతో ప్రేమతో వండిన వెదురు బొంగు చికెన్(baboo chichen), ఇతర వంటకాలను రుచి చూడాలని కోరారు.

 అయితే, ప్రస్తుతం శరన్నవరాత్రి పర్వదినాలు జరుగుతుండటం వల్ల తాను కఠినమైన ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తున్నానని, అందువల్ల మాంసాహారం తీసుకోలేకపోయానని ఆయన వివరించారు. గిరిజనులు చూపిన ప్రేమాభిమానాలను తాను ఎంతో గౌరవిస్తానని, కానీ పండుగ సమయాల్లో భక్తిశ్రద్ధలతో ఉండే నియమాల కారణంగా వారి ఆతిథ్యాన్ని స్వీకరించలేకపోయినందుకు మన్నించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

 గిరిజనుల మనోభావాలను గౌరవిస్తూనే, తన ఆధ్యాత్మిక దీక్షా నియమాలను వారికి అర్థమయ్యేలా చెప్పడంతో స్థానిక గిరిజనులు కూడా ఆయన నిర్ణయాన్ని సానుకూలంగా స్వీకరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, మారుమూల గూడేలకు రహదారుల సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గిరిజనుల జీవన విధానం, వారి సంస్కృతీ సంప్రదాయాలపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

 స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్పూర్తితో గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని భరోసానిచ్చారు. పవన్ కళ్యాణ్ స్వయంగా తమ గ్రామాలకు వచ్చి, రచ్చబండపై కూర్చుని తమ సమస్యలు అడిగి తెలుసుకోవడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటన గిరిజనులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#PawanKalyan#AdaviThalliBata#PolavaramTour#TribalDevelopment#APNews2026#JanaSenaParty#TraditionalFoodRules
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి