తెలంగాణ

BJP : రోహింగ్యా ఓట్ల కోసమే కదా? పొన్నంకు బీజేపీ చీఫ్ కౌంటర్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో సమగ్ర ఓటరు సవరణ జాబితా (SIR) ప్రక్రియ సజావుగా సాగడం లేదని, పేర్లలో చిన్న చిన్న పొరపార్లను చూపి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోందని, అర్హుల ఓట్లను కూడా తొలగిస్తున్నారని మంత్రి ప్రభాకర్ ఆరోపించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో సమగ్ర ఓటరు సవరణ జాబితా (SIR) ప్రక్రియ సజావుగా సాగడం లేదని, పేర్లలో చిన్న చిన్న పొరపార్లను చూపి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోందని, అర్హుల ఓట్లను కూడా తొలగిస్తున్నారని మంత్రి ప్రభాకర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ అంశం మాట్లాడేందుకు రావాలని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుకు మంత్రి సవాల్ విసిరారు. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను అన్ని రకాల ఆధారాలతో మీ ముందుకు తీసుకొస్తానన్నారు. చర్చించేందుకు తేదీ, సమయం, వేదికను ఖరారు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, ఓటర్ల జాబితా సవరణ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓట్లు డిలీట్ చేశారని ఆరోపించారు. ఒక్క తెలంగాణలోనే సుమారు 70 లక్షల మంది, కేవలం హైదరాబాద్‌లోనే 40 లక్షల మంది ఓట్లు తొలగించారని ఆరోపించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించారన్నారు. ఓటరు లిస్టులో తన తండ్రి పేరులో చిన్న తప్పు దొర్లడం వల్ల తన సొంత ఓటును కూడా తొలగించేందుకు ప్రయత్నించారని నిన్న మీడియాతో మంత్రి మాట్లాడిన విషయం తెలిసిందే. ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తున్న వారిని పోలీసులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని హితవు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉండగా, ఎస్ఐఆర్‌లో భాగంగా ఓట్లు కోల్పోయిన వారిని తీసుకొస్తానని, చర్చకు రావాలని మంత్రి పొన్నం విసిరిన సవా‌ల్‌కు తాజాగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బోగస్ ఓట్లు ఉన్నాయని గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీనే బహిరంగంగా ప్రకటించారని గుర్తుచేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ముందుగా ఆ విషయంపై సింఘ్వీని వివరణ కోరాలని హితవు పలికారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల అక్రమ ఓట్లు తొలగిపోతున్నందుకే కాంగ్రెస్ పార్టీ రోడ్లెక్కి ధర్నాలు చేస్తోందని విమర్శించారు. కాగా, రాంచందర్ రావు కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నగరంలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని తెలిసినా వారిని తిరిగి వారి దేశానికి డిపోర్టు చేయడం లేదని, ఎంఐఎం పార్టీ కోసం, పొత్తు ధర్మం కోసం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని బీజేపీ ముందు నుంచి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

#ponnam prabakar#bjp state cheif ramchandar rao#politics#SIR#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి