సినిమా

SS Rajamouli: రామాయణ సినిమాలేవీ జక్కన్నకి నచ్చలేదా?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

SS Rajamouli: సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా ఎస్.ఎస్.రాజమౌళికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. హీరోలను చూసి సినిమా కొనే స్థాయి మార్చేసిన దర్శకుడు రాజమౌళి. సినిమా పోస్టర్ మీద రాజమౌళి పేరు కనిపిస్తే బిజినెస్ పూర్తైపోతుంది. హీరో గురించి తర్వాత ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకూ రాజమౌళి తీసిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కాలేదు. ఐతే, తాజాగా ఇప్పటి వరకూ వచ్చిన రామాయణ సినిమాల గురించి జక్కన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

  1. బాలీవుడ్‌లో ఇప్పుడు రామాయణ రెండు భాగాలుగా వస్తోంది. మొదటి భాగం ఈ నవంబర్ నెలలో దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి ఫస్ట్ థియేట్రికల్ ట్రైలర్ వచ్చి..అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రామాయణ విడుదల సమయం దగ్గరపడుతున్న కారణంగా రెండవ ట్రైలర్‌తో సినిమాపై బజ్ పెంచేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మీద బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

ఇదిలా, ఉంటే ఇలాంటి సమయంలో రాజమౌళి.. రామాయణ సినిమాలపై కామెంట్స్ చేయడం అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకూ వచ్చిన రామాయణ సినిమాలేవీ నాకు నచ్చలేదు..అంటూ జక్కన్న చెప్పడం ఇండస్ట్రీలో చాలామందిని షాకయ్యేలా చేసింది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ భారీ డిజాస్టర్ అని చెప్పాలి. కానీ, గతంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయినా, అవేవీ రాజమౌళికి సంతృప్తి నివ్వలేదట.

అసలైన రామాయణం ఎలా ఉంటుందో నేను చూపిస్తానని రాజమౌళి ఇటీవల ఎంపైర్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం షాకింగ్ విషయం. అంతేకాదు, ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న వారణాసి సినిమాలో ప్రత్యేకించి రామాయణ ఎపిసోడ్ ఉంటుంది. దీనిపై, చాలా నమ్మకంగా చెప్తున్నాడు. మహేష్ 20 నుంచి 25 నిమిషాల పాటు శ్రీరాముడిగా కనిపిస్తాడట.

ఈ సీన్స్ అన్నీ సినిమాకి మేజర్ ప్లన్ అని..అసలైన రామాయణం కనిపిస్తుందని రాజమౌళి చెప్పి సినిమాపై అసాధారణమైన అంచనాలను పెంచాడు. మరి, నిజంగా రాజమౌళి..మహేష్ పోషించిన శ్రీరాముడి పాత్రలో అంత బాగా నటించాడా..! అనేది తెలియాల్సి ఉంది.

కాగా, ఈ సినిమాలో మహేష్ బాబుకి జంటగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, విలన్ కుంభ పాత్రలో మలయాళ క్రేజీ స్టార్ పృథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. 2027, ఏప్రిల్ 7న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతన్నారు.

#Ramayana 1#Ramayana 2#Varanasi#Mahesh Babu#SS.Rajamouli
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి