తెలంగాణ

TG : ఆదిలాబాద్ ‘రిమ్స్’ పాపం ఎలుకలదా? సర్కారుదా?

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) హాస్పిటల్‌లో సంభవించిన ప్రమాదానికి కారణం ‘ఎలుకలు’ అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 21, 2026 అర్ధరాత్రి సమయంలో ఏసీ పేలిన ఘటనలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) హాస్పిటల్‌లో సంభవించిన ప్రమాదానికి కారణం ‘ఎలుకలు’ అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 21, 2026 అర్ధరాత్రి సమయంలో ఏసీ పేలిన ఘటనలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. న్యూ బార్న్ కేర్ యూనిట్‌లో ఏసీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగాయి.

ప్రమాదం సంభవించిన సమయంలో వార్డులో 23 మంది శిశువులు ఉండగా, సిబ్బంది,సెక్యూరిటీ గార్డులు, అంబులెన్స్ డ్రైవర్లు సాహసంతో 22 మంది పసికందులను రక్షించారు. అయితే, అగ్నిప్రమాదం, విశవాయువులు పీల్చడం మూలంగా రోజుల వ్యవధిలో మొత్తం ఐదుగురు శిశువులు చనిపోయారు. ఈ ప్రమాద ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం జిల్లా కలెక్టర్ రాజర్షి షా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేయగా తాజాగా ప్రభుత్వానికి 50 పేజీల నివేదికను సమర్పించింది.

ఎలుకలు ఏసీ వైర్లను కొరకడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు విచారణ కమిటీ నివేదికలో పేర్కొనట్టు తెలిసింది.అయితే, ఎలుకల వల్లే అంతపెద్ద ప్రమాదం జరిగిందా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏసీల నిర్వహణ లోపాలు, విద్యుత్ వ్యవస్థలో నిర్లక్ష్యం, అపరిశుభ్రత, ఆహార వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయటం ఆసుపత్రిలో ఎలుకల సంచారం పెరిగిందని కమిటీ నివేదిక ఇచ్చింది.

ఎలుకలు విద్యుత్ తీగలను కొరికే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడినట్టు సమాచారం.నాలుగు ఏసీల నిర్వహణలో లోపాలు, గ్యాస్ లీకేజీలను గుర్తించారు.అధిక లోడ్‌తో ఓ ఏసీలో మంటలు చెలరేగినట్లు నిర్ధారణకు కమిటీ వచ్చింది. రెండు ట్రాన్స్‌ఫార్మర్లలో ఒకటి పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. ఈ మేరకు కమిటీ 50 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా..

నిర్వహణ లోపాలు, పర్యవేక్షణ వైఫల్యాలను ఎలుకల ఖాతాలో వేస్తున్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన శిశువులు మరణిస్తే ఆ పాపం ఎలుకల మీద వేస్తారా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

#Rats#AC blast#ADilabad Rims#Telangana#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి