National

National : రాహుల్, ఖర్గేకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

ఎస్ఐఆర్, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించేందుకు లోక్‌సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌ను అపాయింట్‌మెంట్ కోరగా ఆయన నిరాకరించారు.అందుకు గల కారణాలను చీఫ్ జస్టిస్ సోమవారం ఉదయం మీడియాకు వెల్లడించారు.

ఎస్ఐఆర్, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించేందుకు లోక్‌సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌ను అపాయింట్‌మెంట్ కోరగా ఆయన నిరాకరించారు.అందుకు గల కారణాలను చీఫ్ జస్టిస్ సోమవారం ఉదయం మీడియాకు వెల్లడించారు. అయితే, రాహుల్ గాంధీ, తనకు మధ్య నడిచిన లేఖల రాయభారంపై వివరాలు వెల్లడించేందుకు జస్టిస్ సూర్యకాంత్ ఇష్టపడలేదు.

కేంద్రప్రభుత్వం ‘ఓటు చోరీ’కి స్వస్తి పలకాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా, ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) నిలిపివేత, ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఒక వినతిపత్రాన్ని సమర్పించేందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గేలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు ఆదివారం రాహుల్ గాంధీ సీజేఐకి లేఖ రాశారు.

అయితే, రాహుల్ గాంధీ, ఖర్గేతో భేటీకి నిరాకరించడంపై సీజేఐ జాతీయ మీడియాకు వివరాలు వెల్లడించారు. రాహుల్ గాంధీ తనకు రాసిన లేఖ ఆదివారం అందిందని, ఆ వెంటనే దానికి బదులిచ్చానని తెలిపారు.రాజకీయ పార్టీల ప్రతినిధులతో పరిపాలనా స్థాయిలో సమావేశం కావడం సాధ్యం కాదని, కొన్ని నిర్దిష్ట అంశాలు అడ్డొస్తాయని, అందుకే తాను కలువలేకపోతున్నానని లేఖలో పేర్కొన్నట్టు తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ (NHRC) కార్యక్రమంలో మాట్లాడిన అనంతరం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.

సమావేశం కాకపోవడానికి గల కారణాలను వివరించాలని కోరగా ‘ఆ లేఖలోని అంశాల గురించి రాహుల్ గాంధీనే అడగాలని మనవి చేస్తున్నాను. నేను మాత్రం దాని గోప్యతను కాపాడాను’ అని చీఫ్ జస్టిస్ బదులిచ్చారు. చట్టసభల ప్రతినిధులు, ఎంపీలు తమ ఆందోళనలను ఎలా ముందుకు తీసుకెళ్లాలని ప్రశ్నించగా సుప్రీంకోర్టు తలుపులు అందరికీ ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని సీజేఐ స్పష్టం చేశారు.

సామాన్యులు, ప్రజాప్రతినిధి ఎవరైనా ఒక్క పిటిషన్‌ వేసి కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. చట్టానికి లోబడి వారి సమస్యలను విచారించి తగిన న్యాయం అందిస్తామని సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీలోని ప్రస్తుత పరిస్థితులు, నిరసనలపై మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. అది శాంతిభద్రతల అంశమని కేంద్రం పరిధిలోనిది అంటూ పేర్కొన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) 'వన్ నేషన్ వన్ ఎలక్షన్'విషయంలో కోర్టులో పరస్పర ప్రయోజనాల ఘర్షణ ఏర్పడే అవకాశం ఉన్నందున, న్యాయమూర్తులంతా కలిసి పరిపాలనా పరంగా చర్చించి ఆ పర్యటనను నివారించాలని సమిష్టి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

#Supream court cheif justice#rahul gandi#karge#no appointment#Delhi#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి