International

international : హోర్ముజ్‌లో దాడులు.. ఇద్దరు భారతీయులు గల్లంతు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య వైరం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అమెరికా శాంతిచర్చలు అంటూనే దాడులకు తెగబడుతోంది. ఇరాన్‌ షరతులకు అంగీకరించకపోతే దాడులు తీవ్ర తరం చేస్తామని పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నది. గతకొన్నినెలలుగా సాగుతున్న ఈ యుద్ధం కేవలం పశ్చిమాసియాకే కాదు.

ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య వైరం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అమెరికా శాంతిచర్చలు అంటూనే దాడులకు తెగబడుతోంది. ఇరాన్‌ షరతులకు అంగీకరించకపోతే దాడులు తీవ్ర తరం చేస్తామని పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నది. గతకొన్నినెలలుగా సాగుతున్న ఈ యుద్ధం కేవలం పశ్చిమాసియాకే కాదు..మొత్తం ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెడుతోంది. అమెరికా దాడులు చేస్తున్న ప్రతిసారి ఇరాన్ హోర్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తోంది..

దాని గుండా ప్రయాణిస్తున్న ముడిచమురు, వర్తక నౌకలను హోర్ముజ్ దాటనివ్వడం లేదు. ఫలితంగా వ్యాపార సంస్థలు నష్టపోతున్నాయి. ముడిచమురు దిగుమతి ఆలస్యం కావడంతో ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఫలితంగా దేశాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ఆర్థికవ్యవస్థలు తలకిందులు అవుతున్నాయి. ఇదిలాఉండగా, ఇరాన్ మీద మరోసారి ప్రతిదాడులు పెంచాలని ట్రంప్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు అమెరికా నుంచి మరోసారి 10వేల మంది ట్రూప్స్ బయలు దేరినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే హోర్ముజ్ జలసంధిలో మరోసారి యుద్థవాతావరణం కనిపిస్తోంది. అందులో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడి జరిగింది. ఎంటీ పెట్రో డాల్ఫిన్ అనే నౌకపై డ్రోన్‌ దాడి జరగగా ట్యాంకర్‌లో అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన టైంలో నౌకలో 11 మంది భారతీయులు ఉన్నారు. వారిలో 9మందిని సురక్షితంగా కాపాడగా, ఇద్దరు గల్లంతైనట్టు సమాచారం.

వెంటనే అప్రమత్తమైన స్థానిక కోస్టు గార్డ్ దళం గల్లంతైన ఇద్దరు నావికుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.ఈ ఘటనపై ఓడరేవులు, నౌకాయాన జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనావాల ‘ఎక్స్’ వేదికగా రియాక్ట్ అయ్యారు. పెట్రో డాల్ఫిన్ అనే ట్యాంకర్‌పై సోహార్ యాంకరేజ్ వద్ద డ్రోన్ దాడి జరిగిందని తెలిపారు. నౌకలో 11మంది భారతీయ సిబ్బంది ఉంటే వారిలో ఇద్దరు గల్లంతయ్యారన్నారు. గల్లంతైనవారి కోసం స్థానిక కోస్ట్ గార్డులు గాలింపు, సహాయక చర్యలు చేపట్టారన్నారు. భారతీయుల క్షేమం కోసం తాము ఎప్పటికప్పుడు సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నామన్నారు. అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్టు వెల్లడించారు.

#hormuz straight#drone attack#2 indians missing#international#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి