తెలంగాణ

Telangana: భూ స్కాం వార్తలకు ట్రెండ్ సెట్టర్ "స్వేచ్ఛ న్యూస్"..

రచన: Venu4 నిమిషాల పఠనం

భూ ఉద్యమాలు ప్రభుత్వాల తప్పిదాలతోనే పుడతాయి. ఆనాటి ఖిస్తు వసూల్ కోసమే మీరు చెప్పిన 60 శాతం 40 శాతం భూములపై పన్ను వేశారు. ఆ పన్నులు పంటలు పండని భూములపై వేసినందుకే ఎన్నో పోరాటాలు వచ్చాయి. కౌలుదారుల చట్టం నుంచి సీలింగ్ వరకు పలు చట్టాలు తీసుకొచ్చారు.

- రెండేండ్ల క్రితమే చెప్పినా... ఇప్పుడెందుకు గుర్తుకువచ్చాయి?

- మీ దాకా వస్తే కానీ తెలియడం లేదా బీదోళ్ల నొప్పి?

- 10 లక్షల కోట్ల భూ స్కాం అన్నారు.. అధికారం వచ్చిన మూడేండ్లు ఏం చేశారు?

-2 లక్షల కోట్ల టార్గెట్‌తో పని చేస్తున్న మీ మాఫియా గుట్టు రట్టు చేస్తేనే నిన్న సభలో మాట్లాడరా?

- మీరు తెలంగాణ భూ చరిత్ర చెబితే కానీ సమాజానికి తెలియదనుకోకండి?

- కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగా మీరు కూడా భ్రమల్లో బతికేయకండి?

- రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి మీరు ఎంత తీసుకున్నారో?

- మీ బినామీ వ్యవహారాలు ఏంటో ప్రభుత్వం మారకుండానే వార్తలుగా ఇస్తాం..

- చర్యలు తీసుకునే దమ్ము ఉందా?

- ఇకచాలు.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోండి

- లేదంటే ప్రభుత్వ దందాలపై రోజు ఇలాగే రాయల్సి వస్తుంది?

- మీరు చెప్పిన కమ్యూనిస్టుల భూ ఉద్యమంలా ప్రతి సెల్ ఫోన్ బటన్ నుంచి పుట్టిస్తాం..

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్

9848070809

భూ ఉద్యమాలు ప్రభుత్వాల తప్పిదాలతోనే పుడతాయి. ఆనాటి ఖిస్తు వసూల్ కోసమే మీరు చెప్పిన 60 శాతం 40 శాతం భూములపై పన్ను వేశారు. ఆ పన్నులు పంటలు పండని భూములపై వేసినందుకే ఎన్నో పోరాటాలు వచ్చాయి. కౌలుదారుల చట్టం నుంచి సీలింగ్ వరకు పలు చట్టాలు తీసుకొచ్చారు. 1950 నుంచే మీ కాంగ్రెస్ పాలన ఉంది కదా, 1976 వరకు ఎందుకు ఆలస్యం చేశారు. ప్రజల అనుకూలం కోసం చట్టాలు పని చేయాలి. కానీ, మీరు అవకాశ రాజకీయం కోసం మాత్రమే పని చేస్తున్నారు. మూడేండ్ల నుంచి గుర్తుకు రాని విషయాలు ఇప్పుడు సభలో చెబితే ఎలా సీఎం గారు. మీరు ఇదే రియల్ ఎస్టేట్ చేసి ఇంత దూరం వచ్చారు. గత 20 ఏండ్లుగా లీడర్‌గా, బినామీ లావాదేవీలు ఎన్ని చేశారో స్వేచ్ఛ న్యూస్‌కు తెలుసు.. చెప్పమంటే రేపటి నుంచే మొదలు పెడుతాం.

సర్కార్ మీదే అయినా.. అదే బ్లాక్ మెయిల్?

ఎలాంటి లాభాలను ఆపేక్షించకుండా ప్రజా సేవ చేసే మావోయిస్ట్ అంటారో మరేదైనా అంటారో అనండి. ఆధారాలతో స్వేఛ్చ న్యూస్ మీ ఆర్ధిక లావాదేవీలను ప్రశ్నిస్తుంది. ఎందుకు ఫినిక్స్ పొందిన భూముల దర్యాప్తు చేయలేదు? వంశీరాం భూములు, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి బినామీ డ్రామాలు ఎందుకు సభలో మాట్లాడలేదు? ఆనాడే మాట్లాడారుగా, ఈనాడు ఎందుకు ప్రస్తావించలేదు. ఢిల్లీకి మూటలు కట్టాలంటే ఆ కంపెనీలు అవసరం ఉంటుందా? మీరు, మీ ప్రభుత్వం 2 లక్షల కోట్ల టార్గెట్‌తో చేస్తున్న దందాలు ప్రతి నిత్యం స్వేచ్ఛ న్యూస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల బయట పెడుతూనే ఉంటారు.

#Telangana#Land Movements#Vamsiram lands#former MP Ranjith Reddy#Swachha News#trendsetter#reporting land scams
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి