International

అమెరికా వడ్డీ రేట్ల షాక్.. రూపాయి, స్టాక్ మార్కెట్లపై పడనున్న తీవ్ర ప్రభావం!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) కీలక ఫెడరల్ ఫండ్స్ రేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో వడ్డీ రేట్లు 3.75 - 4 శాతానికి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం ఇంకా లక్ష్యానికి పైన ఉండటం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ఈ నిర్ణయం తప్పలేదని ఫెడ్ పేర్కొంది.

 అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) కీలక ఫెడరల్ ఫండ్స్ రేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో వడ్డీ రేట్లు 3.75 - 4 శాతానికి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం ఇంకా లక్ష్యానికి పైన ఉండటం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ఈ నిర్ణయం తప్పలేదని ఫెడ్ పేర్కొంది. అయితే అగ్రరాజ్యంలో జరిగిన ఈ వడ్డీ రేట్ల పెంపు అంతర్జాతీయ వాణిజ్య సరళిని మార్చడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థపై కూడా గణనీయమైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 ఫెడ్ నిర్ణయంతో డాలర్ మరింత బలపడటంతో భారత రూపాయి మారకం విలువ తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే 2026లో రికార్డు కనిష్ఠాలను తాకిన రూపాయి మరింత బలహీనపడితే దిగుమతుల వ్యయం గణనీయంగా పెరుగుతుంది. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. రూపాయి పతనం, ముడిచమురు ధరల కలయిక వల్ల దేశీయంగా రవాణా ఖర్చులు పెరిగి, ద్రవ్యోల్బణం తీవ్రమై నిత్యావసరాల ధరలు ప్రియమయ్యే ముప్పు పొంచి ఉంది.

 మరోవైపు, అమెరికా బాండ్ మార్కెట్లలో అధిక రాబడులు ఆకర్షణీయంగా మారడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను వేగంగా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. 2026లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) ఏకంగా రూ.2.41లక్షల కోట్లకు పైగా ఉపసంహరించుకోగా, తాజా పెంపుతో ఈక్విటీ మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశీయ స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు గురికావడంతో పాటు మూలధన ప్రవాహం నెమ్మదించే సూచనలు ఉన్నాయి.

 ఈ పరిణామాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందు కొత్త సవాళ్లను నిలిపాయి. రూపాయి స్థిరత్వాన్ని కాపాడటం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం ఆర్బీఐకి అత్యంత కీలకంగా మారనుంది. అమెరికా వడ్డీ రేట్ల వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి ఆర్బీఐ కూడా రాబోయే సమీక్షల్లో రెపో రేటును పెంచక తప్పనిసరి పరిస్థితి ఏర్పడవచ్చు. అదే జరిగితే, బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచి గృహ, వాహన లోన్ల ఈఎంఐల భారం పెరిగి సగటు వినియోగదారులు, వ్యాపార వర్గాలపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

 

#LionelMessi#InterMiami#CampeonesCup#Messi100Goals#MLS#FootballNews#SportsNewsTelugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి