తెలంగాణ

Telangana: మహా కరువుపైనా అవే ఉద్దర మాటలు?

రచన: Venu••7 నిమిషాల పఠనం

ఎవరైనా హెచ్చరిస్తే కాని, డిమాండ్ చేస్తే కాని, ప్రతిపక్షాలు ధర్నాలు చేసి ప్రశ్నిస్తే కాని రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వదలడం లేదు. కమిటీలు, కార్యాచరణ సీఎంగా వాళ్లు నిలదీయక ముందే ఉండాలి.

కరువు రాగానే మురిగిపోయిన మూడేళ్ల కింద ముచ్చటలు?

కౌలు రైతులను కనికరించలేదు.. ఎకరానికి 10 వేల హామీ ఇవ్వలేదు?

జెన్ జీ ఉద్యమంలా వస్తుందని ఊహించి, రైతు రాజులా ఆలోచించాలని ఉచిత సలహాలు

నాయకులేమో అవినీతి సొమ్ముతో ఆస్తులు పెంచుకోవాలి.. రైతులేమో ఓపిగ్గా అప్పుల బాధతో చావాలా?

1947 నాటి రైతాంగం ఇప్పుడు లేదు.. సెల్ ఫోన్‌లో మీ బాగోతాలన్నీ వింటున్నారు.. చూస్తున్నారు?

ఈ కరువులో పంట బీమా వర్తిస్తే ఓ ధీమా

చనిపోతే వచ్చే రైతు బీమా ఇవాళ్టి నుంచే అమలు చేస్తామంటే ఓ భరోసా?

రెండు లక్షల వరకు రుణమాఫీ కాని రైతులెందరో.. వారికి హామీ ఇచ్చినా కొంత ఒపిక ఉండేది?

పెండింగ్ ఉన్న రైతు భరోసా పైసలు ఇస్తామంటే ముఖంలో సంతోషం ఉండేది?

మేల్కొన్నదే ఆలస్యం.. రైతులపై అనగానే అఖిలపక్షం.. పండగ తర్వాత దాకా దాటవేత?

కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆర్థిక భరోసాపై ఇవాళనే లేఖ ఎందుకు రాయలేకపోతున్నారు?

- ఉపాధి హామీ ఒక్కటే కుటుంబం కడుపు నింపదు

- కుటీర పరిశ్రమలతో, ప్రత్యామ్నాయ రంగాలకు మళ్లించండి

- కౌలు రైతుకు, రైతు కూలీలపై మీ మానిఫెస్టోలో ఇచ్చిన హమీలు ఇప్పుడు అమలు చేయండి

- వీటన్నింటిపై త్వరితగతిన చర్యలు ఉంటేనే మీరనుకున్నట్లు రైతు రాజులా ఆలోచిస్తాడు

- మిమ్మల్ని మహారాజులా చూస్తాడు

- లేదంటే జెన్ జీలను మించిన ఆకలి కడుపు ఉద్యమాన్ని చవి చూస్తారు

- 7 లక్షల ఎకరాలకు తోడుగా మరో 14 లక్షల ఎకరాలు ఎండకుండా ఎలా చేస్తారు?

- మహా కరువు అని ముందే హెచ్చిరించిన స్వేచ్ఛ న్యూస్

- అయినా కూడా ముందు చూపు లేనితనంతో ముచ్చట్లు

- మూడు నెలలకైనా ప్రజలు తిరుగబడడం ఖాయం?

- ఇలా ఎన్నో సంఘటనలు స్వేచ్ఛ న్యూస్ ముందే గుర్తిస్తుంది

- ఇంకా రెండేళ్లు ఎవరు ఏం చేయలేరనే భరోసా మీకున్నా.. ప్రతి రోజు అప్రమత్తత అవసరమని స్వేచ్ఛగా హెచ్చరిస్తున్నాం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ చైర్మన్

అనుకోకుండా వచ్చిన కరోనాకు మోదీ చెప్పిన ముచ్చట్లే, ఏడాది ముందు నుంచే చెబుతూ వచ్చిన కరువుపై రేవంత్ రెడ్డి చెబుతున్నారనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తోంది. నీళ్లు ఎత్తిపోసేందుకు అవకాశాలు ఉన్నా, వర్షాలు పడుతాయి.. మళ్లీ ఎందుకు ఎత్తిపోయడం.. కరెంట్ ఖర్చులు తగ్గించుకునేందుకు నీళ్లు ఎత్తిపోయలేదు అని చెబుతూ వచ్చారు. కరువు ఛాయలు, ఎండల తీవ్రత వచ్చి 20 రోజులకు పైగానే అవుతోంది. సూపర్ ఎల్ నినోపై కనీసం అవగాహన లేకుండా ఢిల్లీ, గోవా, కేరళం అంటూ పార్టీల కార్యక్రమాలకు తిరుగుతూ రైతన్నలను పట్టించుకోలేదు. 7 లక్షల ఎకరాల్లో ఎండిన పొలాలను చూపించి, రైతుల అప్పుల బాధలు వినిపిస్తే కాని రెండు రోజులుగా ఆఫీసర్స్‌తో మీటింగ్ పెట్టి హడావుడి చేస్తున్నారు.

కరువుపై కొట్లాడితేనే బతుకు?

స్వేచ్ఛ న్యూస్ మొదటి నుంచి సమస్యలను ముందే పసిగడుతుంది. మీరు చేసే పనులు మూడు రోజుల ముందే చేసినా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. రైతులకు, ప్రజలకు విశ్వాసం కల్పిస్తాయి. రాజకీయ మాటల్లో ఉన్న చతురత, పాలనలో లేకపోవడం, ఎవరైనా హెచ్చరిస్తే కాని, డిమాండ్ చేస్తే కాని, ప్రతిపక్షాలు ధర్నాలు చేసి ప్రశ్నిస్తే కాని రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వదలడం లేదు. కమిటీలు, కార్యాచరణ సీఎంగా వాళ్లు నిలదీయక ముందే ఉండాలి. వాళ్లు బట్టలూడదీసిన తర్వాత ఇప్పుడు మూడేళ్ల క్రితం ముచ్చట చెప్పి తప్పించుకున్న తీరు చూస్తేనే అంతా అర్థం అవుతుందని ప్రజల్లో చర్చ జరుగుతోంది.

కౌలు రైతులకు , కూలీలకు ఏం చేస్తారు?

కాంగ్రెస్ మేనిఫేస్టోలో కౌలు రైతులకు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్ల నుంచి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. కూలీల రూపంలో ఉండే మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేకపోయారు. సాగునీరులో పోతిరెడ్డిపాడు నుంచి భారీగా నీళ్లు ఎత్తుకుపోతుంటే ఏనాడు ప్రశ్నించలేదు. జూరాల వద్దకు రైతులు వస్తే కాని కర్ణాటకకు మంత్రులను పంపివ్వని పరిస్థితి ఎందుకొచ్చింది. పంట మధ్యలోనే ఎండిపోతే చిన్న, సన్నకారు రైతుల రూ.20 వేల కోట్ల పెట్టుబడికి ఎవరు సమాధానం చెబుతారు.

మీరు వందల కోట్లు సంపాదిస్తారు.. మేము ఓపిగ్గా అప్పుల బాధలతో చావాలా?

నోడల్ ఆఫీసర్స్ రైతులకు అవగాహన కల్పించడంతో సరిపెడితే రైతులు ఊరుకోరు. 1947 రోజులు వేరు. అప్పుడు ఒక్క చెంప మీద కొడితే మరో చెంప చూపించేవారు. ఇప్పుడు రాజకీయ అవినీతి పెరిగిన తర్వాత మీ ఆస్తుల వివరాలు రోజూ సెల్ ఫోన్‌లో చూస్తూనే ఉన్నారు. అలాంటిది తామెందుకు ఓపిగ్గా ఉండాలని రోడ్డుమీదకు కచ్చితంగా వస్తారు. కమిటీలు వేసినా మీ కాంగ్రెస్ పాలనలో కరెప్షన్ జరగదు అనే గ్యారెంటీ ఇవ్వలేరు. చాపకింద నీరులా అనేక అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయకపోతే ఉద్యమాలను వద్దనే హక్కు మీకుండదు..

#Telangana#El Nino Effect#congress government#cm revanth reddy#Farmers during times of drought#Super El Nino#Delhi#Goa#Kerala
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి