సినిమా

Srinidhi Shetty: కేజీఎఫ్ కి పూర్తి భిన్నమైన పాత్రలో శ్రీనిధి!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Srinidhi Shetty:కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించిన లేటెస్ట్ సినిమా ఆదర్శకుటుంబం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు. అయితే, సినిమాలో ఉన్న డైలాగ్ మాదిరిగానే వెంకీ-శ్రీనిధిల మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. వాస్తవానికి, శ్రీనిధి యూత్ హీరోలతో సినిమాలు చేయాల్సింది. కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చి వెంకటేష్ హీరో అనగానే ఒప్పుకుంది.

Srinidhi Shetty:కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించిన లేటెస్ట్ సినిమా ఆదర్శకుటుంబం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు. అయితే, సినిమాలో ఉన్న డైలాగ్ మాదిరిగానే వెంకీ-శ్రీనిధిల మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. వాస్తవానికి, శ్రీనిధి యూత్ హీరోలతో సినిమాలు చేయాల్సింది. కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చి వెంకటేష్ హీరో అనగానే ఒప్పుకుంది. మరి, ఆమె కెరీర్‌కి ఇది మైనస్ అవుతుందా అనేది ఆదర్శకుటుంవం విడుదలయ్యాక గానీ తెలీదు.

లవర్‌గా నటించాల్సిన శ్రీనిధి:

కన్నడలో యష్, తెలుగులో నాని, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యంగ్ హీరోలతో నటించిన శ్రీనిధికి వారితో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ బాగా వర్కౌట్ అయింది. హిట్ 3 లో నానికి జంటగా నటించిన ఈ కన్నడ బ్యూటీకి మంచి పేరొచ్చింది. అలాగే.. తెలుగు, కన్నడ భాషలలో యంగ్ హీరోలతో నటించే సినిమాలను ఒప్పుకుంటే ఎంతైనా కెరీర్‌కి బాగా ప్లస్ అవుతుంది. కానీ, సీనియర్ హీరోలతో సినిమా అంటే గ్యారెంటీగా తర్వాత పరిణామాలను ఊహించడం కష్టమే.

కేజీఎఫ్ సిరీస్:

శ్రీనిధికి పాన్ ఇండియా వైడ్‌గా గుర్తింపు తెచ్చిన సినిమా కేజీఎఫ్ సిరీస్. భారీ యాక్షన్ సినిమా అయినప్పటికీ యష్ సరసన నటించడం..అది కూడా ప్రేమికురాలి పాత్ర కావడం బాగా కలిసొచ్చింది. అయితే, అందుకు పూర్తిగా భిన్నమైన సినిమా ఆదర్శకుటుంబం. ఇందులో ఇద్దరు పిల్లలకి తల్లిగా నటించింది శ్రీనిధి. ఇంతకముందు, వెంకీమామ సినిమాలో పాయల్ రాజ్‌పుత్.. వెంకీకి జంటగా నటించింది. ఆ తర్వాత, ఈమెకి యంగ్ హీరోలతో ఛాన్స్ రాలేదు. ఇప్పుడు, శ్రీనిధి పరిస్థితి కూడా అలాగే అవుతుందా! అనే సందేహాలు కలుగుతున్నాయి.

శ్రీనిధికి ఇక్కడ రెండు కలిసొచ్చే అంశాలున్నాయి. ఒకటి భారీ కాస్టింగ్..పెద్ద దర్శకుడు కాబట్టి, త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలో కూడా ఛాన్స్ రావచ్చు. ఒకవేళ ఆదర్శకుటుంబం బ్లాక్ బస్టర్ సాధిస్తే..నాగార్జున, బాలకృష్ణ సరసన ఛాన్స్ కూడా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. శ్రీనిధి ఫిజిక్ అటు సీనియర్ ఇటు యంగ్ హీరోలకి సరిపోయేలా ఉంటుంది. కాబట్టి, ఈ సినిమా హిట్ అయితే..ఖచ్చితంగా తెలుగులో కొంతకాలం బండి లాగిస్తుంది. చూడాలి, మరి ఏం జరుగుతుందో.

#Srinidhi Shetty#KGF#Yash#Aadarsha Kutumbam House No: 47 - AK47#Venkatesh#Trivikram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి